అధికారంలో ఉంటే ఏమైనా చేయొచ్చు…అసలు మనలని అడిగేది ఎవరు అనే తీరులో వైసీపీ నేతలు ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. అంటే ఇదేదో తమ సొంత రాజ్యం అన్నట్లు..వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు చేసుకుంటూ వెళుతున్నారు…ప్రశ్నించే వాడిపై కేసులు..నిలదీసే వాడిపై దాడులు…ఇదే గత రెండున్నర ఏళ్లుగా నడుస్తున్న కార్యక్రమాలు. వాళ్ళు, వీళ్ళు అంటే లేదు ఎవరైనా సరే తమకు అణిగిమణిగి ఉండాలని వైసీపీ నేతలు అనుకుంటున్నారు. ఆఖరికి పోలీసులని సైతం వీరు వదలడం లేదు.

వాస్తవానికి పోలీసులని అడ్డం పెట్టుకుని టీడీపీ వాళ్ళకు ఎలా చుక్కలు చూపిస్తున్నారో అందరికీ తెలుసు…అలాంటి పోలీసులపైనే వైసీపీ నేతలు దాడులు చేసే పరిస్తితి వచ్చింది. ఇప్పటికే పోలీసులపై వైసీపీ నేతలు నోరు పారేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇటీవలే మంత్రి సీదిరి అప్పలరాజు…పోలీసులని ఎలా తిట్టారో అంతా చూశారు. ఇక మంత్రి చేసిన కార్యక్రమం మరవక ముందే…తాజాగా వైసీపీ ఎంపీ నందిగం సురేష్..విజయవాడ పోలీస్ స్టేషన్‌లో రచ్చ లేపారు.

నందిగం బంధువులు అర్ధరాత్రి ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారని విజయవాడ కృష్ణలంక పోలీసులు ప్రశ్నించారు..కానీ వారినే నందిగం బంధువులు ఎదురు ప్రశ్నించారు. దీంతో వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ కూడా తాము ఎంపీ సురేష్ బంధువులు అంటూ హడావిడి చేసి, ఎంపీకి ఫోన్ చేశారు. దీంతో ఎంపీ అర్ధరాత్రి స్టేషన్‌కొచ్చి పోలీసులపై బూతులతో రెచ్చిపోయారు…అలాగే ఎంపీ అనుచరులు, ఎస్‌ఐతో పాటు హెడ్‌కానిస్టేబుల్, సెంట్రీ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌పై విచక్షణ రహితంగా దాడి చేశారు. అలాగే వీడియో తీసిన కానిస్టేబుల్ ఫోన్ లాక్కుని, ఆ ఫోన్ బద్దలుగొట్టేశారు. చివరికి ఎంపీ…తమ బంధువులని తీసుకెళ్లిపోయారు.

అయితే ఇంత రచ్చ జరిగినా సరే వారిపై ఎలాంటి కేసులు పెట్టలేదు…ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పై అధికారులు ఏమో దీనిపై విచారణ చేస్తామని అంటున్నారు. మొత్తానికి అధికార పార్టీ నేతలు, పోలీసులని కూడా వదలడం లేదు. మరి వీరికి ప్రజలే సమాధానం చెబుతారేమో చూడాలి.

Discussion about this post