May 28, 2023
ap news latest AP Politics TDP latest News YCP latest news

ఆదిరెడ్డి ఫ్యామిలీకి అడ్వాంటేజ్..రాజమండ్రిలో మళ్ళీ డౌట్ లేనట్లే.!

వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీపై రాజకీయ కక్ష సాధిస్తున్న విషయం తెలిసిందే. టి‌డి‌పి నేతలకు చుక్కలు చూపిస్తున్నారు..కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, ఆర్ధికంగా దెబ్బకొట్టడం..ఈ నాలుగేళ్ల నుంచి ఇదే జరుగుతుంది..ఇలా వైసీపీ కక్ష సాధిస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. అధికార బలాన్ని వాడుకుని ముందుకెళుతుంది. ఇదే క్రమంలో ఇటీవల ఆదిరెడ్డి ఫ్యామిలీని అరెస్ట్ చేశారు. ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాస్‌లని చిట్‌ఫండ్ కంపెనీ విషయంలో సి‌ఐ‌డి అరెస్ట్ చేసింది.

అయితే ఇది కక్ష పూరిత చర్య అని టి‌డి‌పి శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. ఇదే క్రమంలో చంద్రబాబు సైతం..డైరక్ట్ గా రంగంలోకి దిగి..రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళి..ఆదిరెడ్డి ఫ్యామిలీని పరామర్శించారు..ఇటు ఇంటికొచ్చి  ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానికి ధైర్యం చెప్పారు. ఇది వైసీపీ కక్షతో చేస్తుందని, తాము అధికారంలోకి వచ్చాక వైసీపీకి దీనికి రెండింతలు అనుభవించాల్సి వస్తుందని అన్నారు. ఇక ఇలా ఆదిరెడ్డి ఫ్యామిలీని టార్గెట్ చేసి రాజమండ్రి సిటీలో పై చేయి సాధించాలనేది వైసీపీ స్కెచ్

.

మామూలుగానే రాజమండ్రి టి‌డి‌పి కంచుకోట. గత ఎన్నికల్లో వైసీపీ గాలిలో కూడా టి‌డి‌పి నుంచి ఆదిరెడ్డి భవాని పోటీ చేసి 30 వేల ఓట్లు పైనే మెజారిటీతో గెలిచారు. ఈ సారి ఎన్నికల్లో భవాని భర్త శ్రీనివాస్ పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సారి కూడా అక్కడ టి‌డి‌పిదే పై చేయి అన్నట్లు ఉంది.

ఈ క్రమంలో ఆదిరెడ్డి శ్రీను..ఆయన తండ్రి అప్పారావు అరెస్ట్ జరిగింది. దీంతో వారికి చెక్ పెట్టినట్లే అని వైసీపీ అనుకుంటుంది. కానీ ఈ అరెస్ట్ కక్ష పూరితమని రాజమండ్రి ప్రజలు అనుకునే పరిస్తితి. ఈ అరెస్ట్ తో ఆదిరెడ్డి ఫ్యామిలీపై మరింత సానుభూతి వస్తుంది. దీంతో మళ్ళీ అక్కడ ఆదిరెడ్డి ఫ్యామిలీ సత్తా చాటేలా ఉంది.