Site icon Neti Telugu

999 తర్వాత శ్రీశైలంలో సైకిల్‌కు పట్టు..లోకేష్‌తో లీడ్?

ఉమ్మడి కర్నూలు జిల్లాలో లోకేష్ పాదయాత్ర విజయవంతంగా సాగుతున్న విషయం తెలిసిందే. లోకేష్ పాదయాత్రకు ప్రజా మద్ధతు బాగానే వస్తుంది. అలాగే లోకేష్ పాదయాత్ర చేసే నియోజకవర్గాల్లో టి‌డి‌పికి ప్లస్ అవుతుంది. అయితే కర్నూలులో చాలా సీట్లలో టి‌డి‌పి వరుసగా ఓడిపోతూనే వస్తుంది. ఇప్పుడుప్పుడే ఆ సీట్లలో టి‌డి‌పి బలపడుతుంది. ఇదే క్రమంలో లోకేష్ పాదయాత్ర కూడా టి‌డి‌పికి ప్లస్ అవుతుంది.

ఈ క్రమంలోనే లోకేష్ పాదయాత్ర ఇప్పుడు శ్రీశైలం నియోజకవర్గంలో జరుగుతుంది. దీంతో ఇప్పుడు శ్రీశైలం రాజకీయాలపై చర్చ నడుస్తుంది. ఈ స్థానం వైసీపీ కంచుకోటగా ఉంది. గత రెండు ఎన్నికల్లో ఆ పార్టీనే ఇక్కడ గెలిచింది. అసలు ఇక్కడ టి‌డి‌పి గెలిచి 25 ఏళ్ళు అయిపోతుంది. ఎప్పుడో 1999 ఎన్నికల్లో అక్కడ టి‌డి‌పి గెలిచింది. మళ్ళీ ఇంతవరకు గెలవలేదు. అంటే నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఆత్మకూరు స్థానంగా ఉండేది. అప్పుడు 1983, 1985, 1999 ఎన్నికల్లో టి‌డి‌పి గెలిచింది.

శ్రీశైలంగా ఏర్పాడ్డాక ఒక్కసారి కూడా గెలవలేదు. 2009లో 4 వేల ఓట్ల తేడాతో ఓడిపోగా, 2014లో కూడా 4 వేల తోనే ఓడిపోయింది. అలా గెలుపు వరకు వచ్చి బోల్తా కొట్టింది. 2019 లో మాత్రం 38 వేల ఓట్ల భారీ మెజారిటీతో టి‌డి‌పి ఓడిపోయింది. అయితే 2009లో టి‌డి‌పి నుంచి ఓడిన బుడ్డా రాజశేఖర్ రెడ్డి..2014లో వైసీపీ నుంచి గెలిచి టి‌డి‌పిలోకి వచ్చారు. మళ్ళీ 2019లో ఓడిపోయారు.

ఇక 2014లో టి‌డి‌పి నుంచి పోటీ చేసి ఓడిన శిల్పా చక్రపాణి రెడ్డి..2019లో వైసీపీ నుంచి గెలిచారు. అయితే ఇప్పుడు అక్కడ శిల్పాకు పెద్ద పాజిటివ్ లేదు. టి‌డి‌పి బలపడుతుంది. ఇదే క్రమంలో లోకేష్ పాదయాత్రకు టి‌డి‌పికి కలిసి రావచ్చు. ఇంకా టి‌డి‌పి నేతలు బలంగా పనిచేస్తే..నెక్స్ట్ శ్రీశైలంలో టి‌డి‌పి గెలవచ్చు.

Exit mobile version