రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడుప్పుడే బలపడుతున్న విషయం తెలిసిందే. వైసీపీకి గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో టిడిపి వచ్చింది. అయితే అధికారంలోకి రావాలంటే పార్టీ ఇంకా బలపడాల్సి ఉంది. ఇంకా కొన్ని స్థానాల్లో టిడిపి పట్టు సాధించాలి. అయితే టిడిపి కొన్ని స్థానాలని వదిలేస్తుందా? అనే పరిస్తితి ఉంది. అందుకంటే ఆయా స్థానాల్లో టిడిపి బలంగా కనిపించడం లేదు. మళ్ళీ ఆ స్థానాల్లో డౌట్ లేకుండా ఓడిపోయేలా ఉంది.
చంద్రబాబు సైతం ఆ స్థానాలపై స్పెషల్ గా ఫోకస్ చేసి నేతల చేత పని చేయిస్తున్నట్లు కనిపించడం లేదు. దీని వల్ల ఆ స్థానాల్లో టిడిపి ఆశలు వదులుకోవాల్సిన పరిస్తితి ఉంది. అలా టిడిపికి ఆశలు ఏ మాత్రం లేని స్థానాలు వచ్చి..అరకు, పాడేరు, రంపచోడవరం, సాలూరు, కురుపాం, పాలకొండ..ఈ స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది గాని..టిడిపిపై పాజిటివ్ లేదు. టిడిపి నేతలు పార్టీని గెలుపు దిశగా తీసుకెళ్ళడంలో విఫలామవుతున్నారు.

అరకులో గత ఎన్నికల్లో టిడిపి డిపాజిట్ కోల్పోయింది. ఈ సారి కూడా టిడిపికి ఏ మాత్రం గెలిచే ఛాన్స్ లేదు. పాడేరులో అదే పరిస్తితి. ఇటు రంపచోడవరంలో వైసీపీ ఎమ్మెల్యే పరిస్తితి ఏమి బాగోలేదు..అలా అని టిడిపి పరిస్తితి కూడా బాగోలేదు. అటు సాలూరులో టిడిపి బాగా వెనుకబడింది. కొద్దో గొప్పో కురుపాంలో టిడిపికి కాస్త బలం కనిపిస్తుంది. కాకపోతే సరైన నాయకుడు లేకపోవడం మైనస్. పాలకొండలో చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ వైసీపీకే ఎడ్జ్ ఉంది.
అయితే ఇవన్నీ గిరిజన ప్రాంతాలు కావడం..వారు వైసీపీపై అభిమానంతో ఉండటం, ప్రభుత్వ పథకాలు ప్లస్ అవ్వడం జరుగుతుంది. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా పార్టీపై అభిమానం కలిసొస్తుంది. అదే సమయంలో టిడిపి నేతలు పెద్దగా కష్టపడటం లేదు. దీంతో ఈ స్థానాల్లో టిడిపి ఇంకా గెలవడం అసాధ్యమనే పరిస్తితి.