చంద్రబాబు మాత్రమే కాదు జగన్ కూడా సరిగ్గా పనిచేయని నేతలని పక్కన పెట్టేయడం గ్యారెంటీ అని తెలుస్తోంది. అలాంటి నేతలకు మళ్ళీ సీట్లు వస్తే ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి..అదే సమయంలో కొన్ని చోట్ల సీట్లు కోసం బలమైన నాయకులు కూడా ట్రై చేస్తున్నారు. ఈ పరిణామాలని బేరీజు వేసుకుని…నెక్స్ట్ ఎన్నికల్లో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలని పక్కన పెట్టి వేరే నేతలకు సీట్లు ఇవ్వడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.

ఇదే క్రమంలో పూర్తిగా వైసీపీ చేతుల్లో ఉన్న కర్నూలు జిల్లాలో జగన్ కొన్ని మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల్లోనే కొన్ని సీట్లని మార్చారు. ఈ సారి ఎన్నికల్లో కూడా సీట్లు మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి జిల్లాలో ఉన్న 14 సీట్లలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో 9 మంది రెడ్డి ఎమ్మెల్యేలే ఉన్నారు. అయితే రెడ్డి ఎమ్మెల్యేల సీట్లని కదిలించే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. వారికి మళ్ళీ సీట్లు ఫిక్స్ అని చెప్పొచ్చు.

కానీ మిగిలిన సీట్ల విషయంలో కాస్త మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. మొదట కర్నూలు సిటీలోనే మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఉన్నారు..కానీ ఇదే సీటు కోసం మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ట్రై చేస్తున్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరికి కర్నూలు సీటు దక్కుతుందో క్లారిటీ లేదు.


అటు నందికొట్కూరు సీటు విషయంలో కూడా డౌట్ ఉంది…ఎమ్మెల్యే ఆర్థర్‌ని సైడ్ చేయాలని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వర్గం చూస్తుంది. ఇప్పటికే ఆర్థర్ కూడా తాను మళ్ళీ పోటీ చేయనని చెప్పేశారు. దీంతో నందికొట్కూరులో మార్పులు జరిగే అవకాశం ఉంది. అటు కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్‌కు పాజిటివ్ పెద్దగా లేదు. ఈయనని కూడా సైడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి కర్నూలులో ఈ మూడు సీట్లు డౌటే.

Discussion about this post