ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటలు ఉన్న నియోజకవర్గాలు ఇప్పుడు..వైసీపీ అడ్డాలుగా మారిపోతున్నాయి. గత ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో అదే పరిస్తితి నడిచింది…అసలు టీడీపీ కంచుకోటలుగా ఉన్న కొన్ని స్థానాలు వైసీపీ వశమైపోయాయి. అయితే కొన్ని కంచుకోటల్లో టీడీపీ గెలుపు మరిచిపోయి చాలా ఏళ్ళు అయిపోతుంది. అలా టీడీపీ గెలుపుకు దూరమైన స్థానాల్లో కృష్ణా జిల్లాలోని తిరువూరు నియోజకవర్గం ఒకటి.

పార్టీ పెట్టిన మొదట్లో ఇక్కడ టీడీపీకి తిరుగులేదు. 1983, 1985, 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటింది. మధ్యలో 1989లో మాత్రమే ఓడిపోయింది. అయితే టీడీపీ గెలుపు 1999లోనే ఆగిపోయింది…అప్పటినుంచి ఇప్పటివరకు తిరువూరులో టీడీపీ జెండా ఎగరలేదు. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైంది. గత ఎన్నికల్లో అభ్యర్ధిని మార్చిన పెద్దగా ప్రయోజనం చేకూరలేదు.

నియోజకవర్గంలో ఉన్న సీనియర్ నాయకుడు నల్లగట్ల స్వామీదాసుని పక్కనబెట్టి మాజీ మంత్రి కేఎస్ జవహర్‌కు సీటు ఇచ్చారు. కానీ జగన్ గాలిలో జవహర్ కూడా ఓడిపోయారు. ఇక ఓడిపోయాక జవహర్…తన నియోజకవర్గం కొవ్వూరుకు వెళ్ళిపోయారు. దీంతో తిరువూరులో పార్టీకి దిక్కు లేకుండా పోయింది…స్వామీదాసు ఉన్నా సరే…అంత యాక్టివ్‌గా పనిచేయలేని పరిస్తితి. పైగా ఆయనకు జనాకర్షణ కూడా తగ్గింది.


దీంతో చంద్రబాబు కొత్త నాయకుడుని తిరువూరులో తీసుకొచ్చి పెట్టారు. శావల దేవదత్‌ని ఇంచార్జ్‌గా పెట్టారు. అయితే దేవదత్…ఇంచార్జ్ పదవి రాగానే దూకుడుగా ఉండటం మొదలుపెట్టారు. అప్పుడే నియోజకవర్గంలో తిరిగేస్తున్నారు…చావులు, పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు జనం పిలిస్తే కాదనకుండా వెళుతున్నారు. అలాగే ప్రజా సమస్యలపై దూకుడుగా పోరాటం చేస్తున్నారు. ఇక ఎప్పటికప్పుడు ఏదొక వూరులో పర్యటిస్తూ అక్కడి ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇలా దేవదత్ ప్రజల్లోకి వేగంగా వెళుతున్నారు. ఈ విధంగా ప్రజల కోసం నిలబడుతున్న దేవదత్…అయినా తిరువూరులో టీడీపీ జెండా ఎగరవేస్తారేమో చూడాలి. ప్రస్తుతం ఉన్న రాజకీయాన్ని బట్టి చూస్తే 20 ఏళ్ల తర్వాత తిరువూరులో టీడీపీ జెండా ఎగిరేలాగానే కనిపిస్తోంది.

Discussion about this post