ఇటీవల కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఇంచార్జ్‌లు మారిన విషయం తెలిసిందే. సరిగ్గా పనిచేయని ఇంచార్జ్‌లని చంద్రబాబు పక్కన పెట్టేసి, కొత్త నాయకులకు బాధ్యతలు అప్పగించారు. అయితే కొత్త నాయకులు రాగానే పాత నాయకులు చాలావరకు సైడ్ అయిపోయారు. కానీ కొన్ని నియోజకవర్గాల్లో పాత నాయకులు ఇంకా పట్టు కోసం ట్రై చేస్తూనే ఉన్నారు. దీంతో పాత, కొత్త ఇంచార్జ్‌ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.

ఇలా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పరిస్తితి ఉంది. మామూలుగానే ఎర్రగొండపాలెం టీడీపీకి ఏ మాత్రం కలిసిరాని నియోజకవర్గం…ఇక్కడ పార్టీకి పెద్ద పట్టు లేదు. అటు వైసీపీలో ఉన్న మంత్రి ఆదిమూలపు సురేష్‌కు ఇక్కడ పట్టు ఎక్కువ ఉంది. ఇక్కడ ఆయనకు చెక్ పెట్టడం అంత సులువైన పని కాదు. సురేష్‌కు చెక్ పెట్టాలంటే టీడీపీ ఇంకా చాలా స్ట్రాంగ్ అవ్వాలి. కానీ ఇలా ఆధిపత్య పోరుతో ఎర్రగొండపాలెంలో టీడీపీ ముందుకెళ్లడం కష్టం.

కాకపోతే కొత్త ఇంచార్జ్ ఎరిక్షన్ బాబు నియోజకవర్గంలో యాక్టివ్‌గానే తిరుగుతున్నారు…పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఇంచార్జ్ పదవి ఉన్నంత కాలం పాత ఇంచార్జ్ అజితారావు యాక్టివ్‌గా పనిచేయలేదు. గత రెండు ఎన్నికల్లో ఛాన్స్ ఇచ్చిన ఓడిపోయారు…ఆ తర్వాత కూడా ఇంచార్జ్‌గా కంటిన్యూ చేసిన ప్రయోజనం లేదు. దీంతో చంద్రబాబు అజితాని పక్కన పెట్టి, ఎరిక్షన్ బాబుని ఇంచార్జ్‌గా పెట్టారు. ఇలా కొత్త ఇంచార్జ్ వచ్చాక మళ్ళీ అజితా రావు యాక్టివ్ అయ్యారు.


ఇక ఆమె వర్గం కూడా నియోజకవర్గంలో కాస్త హల్చల్ చేస్తుంది. నియోజకవర్గంలో మళ్ళీ ఆమె ఫ్లెక్సీలు కనబడుతున్నాయి. సరే ఈ ఇద్దరితోనే తలనొప్పి ఉందనుకుంటే…మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు టీడీపీలోకి రావాలని చూస్తున్నారు…టీడీపీలోకి వచ్చి సీటు తీసుకోవాలని చూస్తున్నారు. 2014లో ఈయన వైసీపీ నుంచి గెలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత టీడీపీలోకి వచ్చి పనిచేశారు. మళ్ళీ 2019 ఎన్నికల్లో వైసీపీలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు మళ్ళీ టీడీపీలోకి రావాలని చూస్తున్నారు. ఇలా ఎర్రగొండపాలెం టీడీపీలో నేతల మధ్య ఆధిపత్య పోరు పెరిగి, పార్టీకి ఇంకా డ్యామేజ్ పెరుగుతుంది.

Discussion about this post