రోజురోజుకూ అధికార వైసీపీలో గ్రూపు తగాదాలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. వైసీపీలోనే నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. సొంత పార్టీ నేతలకే ఒకరంటే ఒకరికి పడని పరిస్తితి. ఇలా ఆధిపత్య పోరు చాలా నియోజకవర్గాల్లో నడుస్తోంది. కానీ ఊహించని విధంగా బాపట్ల నియోజకవర్గంలో కూడా ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ఇక్కడ ఎమ్మెల్యేకు, మాజీ ఎమ్మెల్యేల మధ్య పెద్ద రచ్చ నడుస్తోంది.

బాపట్లలో గత రెండు పర్యాయాలుగా వైసీపీ నుంచి కోన రఘుపతి గెలుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నారు. అయితే ఇలా కీలకంగా ఉన్న కోనకు బాపట్లలో తిరుగులేదనే పరిస్తితి ఉంది. కానీ సొంత పార్టీ నేతల రూపంలోనే కోనకు పెద్ద తలనొప్పి ఎదురైంది. కోనకు వ్యతిరేకంగా ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు రాజకీయం నడిపిస్తున్నారు. ఆ ముగ్గురు కూడా బాపట్ల నుంచి ఒకప్పుడు ఎమ్మెల్యేలుగా గెలిచినవారే.

ఆ ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు ఎవరో కాదు…వైసీపీలో కీలకంగా ఉన్న సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మరో సీనియర్ నేత చీరాల గోవర్ధన్ రెడ్డి, ఇక గతంలో కాంగ్రెస్, ఆ తర్వాత టీడీపీలో పనిచేసి గత ఎన్నికల ముందు వైసీపీలో చేరిన గాదె వెంకటరెడ్డి. ఈ ముగ్గురు కూడా గతంలో బాపట్ల ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ఈ ముగ్గురు ఇప్పుడు వైసీపీలోనే ఉన్నారు. అయితే నియోజకవర్గంపై ఉమ్మారెడ్డికి మంచి పట్టు ఉంది. గత రెండు పర్యాయాలు కోన విజయం కోసం ఉమ్మారెడ్డి పనిచేశారు.

నెక్స్ట్ మాత్రం బాపట్ల సీటు తనకు గానీ, తన ఫ్యామిలీలో ఎవరొకరికి ఇప్పించుకోవాలని చూస్తున్నారు. అటు గోవర్ధన్ రెడ్డి సైతం బాపట్ల సీటుపై కన్నేశారు. పైగా ఒకోసారి డైరక్ట్‌గానే కోనపై గోవర్ధన్ రెడ్డి మాటల దాడి కూడా చేస్తున్నారు. ఇక గాదె సైతం..తమ రెడ్డి వర్గానికి బాపట్లలో ప్రాధాన్యత లేదని చెప్పి, రెడ్డి వర్గాన్ని వెనుకేసుకుని కోనకు వ్యతిరేకంగా ముందుకెళుతున్నారు. ఇలా బాపట్లలో నాలుగు గ్రూపులు తయారయ్యాయి. ఈ గ్రూపుల రచ్చతో బాపట్లలో ఫ్యాన్‌కు డ్యామేజ్ జరిగిన జరగొచ్చు.

Discussion about this post