రాజకీయాల్లో ప్రత్యర్ధులు వేరే పార్టీల్లోనే కాదు….సొంత పార్టీల్లో కూడా ఉంటారు. ఒకే పార్టీలో ఉంటూ….ఒకరిపై ఒకరు రాజకీయంగా పైచేయి సాధించేందుకు చూస్తూ ఉంటారు. ఇలా ఒకే పార్టీలో రాజకీయం చేసే నాయకులు మన ఏపీలో ఎక్కువగానే ఉన్నారు. ఈ అంతర్గత రాజకీయాలు అటు అధికార వైసీపీలో, ఇటు ప్రతిపక్ష టిడిపిలో కూడా ఉన్నాయి.

వైసీపీ విషయానికొస్తే…అధికారంలో ఉంది కాబట్టి…అనేక నియోజకవర్గాల్లో ఆ పార్టీలో ఆధిపత్య పోరు ఎక్కువగానే ఉంది. అయితే ఈ ఆధిపత్య పోరుకు తూర్పు గోదావరి జిల్లా ఏమి అతీతంగా లేదు. ఇక్కడ వైసీపీలో అనేక లుకలుకలు ఉన్నాయి. ఇప్పటికే ఎంపీ భరత్, ఎమ్మెల్యే జక్కమపూడి రాజాలకు పడటం లేదు. జగన్ వీరి పంచాయితీకి చెక్ పెట్టిన పెద్దగా ఉపయోగం లేదనే చెప్పాలి. వీరి మధ్య ఇంకా సైలెంట్‌గా రచ్చ నడుస్తున్నట్లే కనిపిస్తోంది.

అయితే ఈ నాయకుల ప్రభావం నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీ మీద ఎలా పడుతుందనేది చూడాలి. వీరే కాదు…సైలెంట్‌గా పలువురు నాయకులు…ఒకరినొకరు చెక్ పెట్టుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. అసలు మొదట నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, తోట త్రిమూర్తులకు పడదనే విషయం తెలిసిందే. దశాబ్దాల కాలంగా వీరు ప్రత్యర్ధులగా తలపడ్డారు. ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నారు. ఇదే క్రమంలో తోట మండపేట వైసీపీ బాధ్యతలు చూసుకుంటున్నారు.

నెక్స్ట్ ఎన్నికల్లో ఇక్కడ తోట బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత రెండు సార్లు నుంచి సుభాష్ ఇక్కడ వైసీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు రాజ్యసభ సభ్యుడుగా ఉన్నారు. అయితే పిల్లికి మండపేటపై పట్టు ఉంది..ఇక్కడ తన వర్గం కూడా బలంగానే ఉంది. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో మండపేటలో వైసీపీ తరుపున తోట బరిలో దిగితే….పిల్లి వర్గం ఎంత వరకు సహకరిస్తుందనేది ప్రశ్నగా ఉంది. ఇప్పటికీ వారు ఉప్పు-నిప్పుగానే ఉన్నారు కాబట్టి, పిల్లి వర్గం తోటకు సహకరించే పరిస్తితి ఉండదు. చివరికి వీరు టిడిపికి బెనిఫిట్ చేసినట్లు అవుతుంది.

Discussion about this post