గుంటూరు జిల్లాలో నరసారావుపేట పార్లమెంట్ స్థానం గానీ, ఆ పార్లమెంట్ స్థానం పరిధిలో ఉంటే అసెంబ్లీ స్థానాల్లో గానీ…మొదట నుంచి కమ్మ సామాజికవర్గం ప్రభావం ఎక్కువగా ఉంటూ వస్తుంది. ముఖ్యంగా టిడిపిలో కమ్మ వర్గం ప్రభావం ఎక్కువ. పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటే…అందులో ఆరు స్థానాల్లో కమ్మ నాయకులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే 2014 ఎన్నికల్లో సత్తా చాటిన కమ్మ నాయకులు 2019 ఎన్నికల్లో చిత్తు అయ్యారు.

ఆ ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది…నరసారావుపేట పార్లమెంట్‌తో పాటు…పెదకూరపాడు, వినుకొండ, సత్తెనపల్లె, నరసారావుపేట, గురజాల, చిలకలూరిపేట, మాచర్ల నియోజకవర్గాలని వైసీపీ గెలుచుకుంది. ఇక ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరు చోట్ల టిడిపి తరుపున కమ్మ నేతలు పోటీ చేసి ఓడిపోయారు. అలాగే పార్లమెంట్ స్థానంలో కూడా కమ్మ నేత పోటీ చేసి ఓడిపోయారు.

అయితే ఈ సారి కమ్మ నేతలు గట్టిగా పుంజుకునేలా కనిపిస్తున్నారు. అందరూ సీనియర్ నేతలే కావడంతో వేగంగా పికప్ అవుతున్నారు. పైగా వైసీపీ ఎమ్మెల్యేలపై కూడా ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా టిడిపి కమ్మ నేతలకు అడ్వాంటేజ్ అయ్యేలా కనిపిస్తోంది. అయితే వచ్చే రెండేళ్లలో వైసీపీపై మరింత పెరిగితే టిడిపికే బాగా అడ్వాంటేజ్ అవుతుంది. ఇక టిడిపి కమ్మ నేతలు గట్టిగానే పని చేస్తున్నారు…ఎలాగైనా నెక్స్ట్ ఎన్నికల్లో గెలవాలనే కసితో ఉన్నారు.

పెదకూరపాడులో కొమ్మాలపాటి శ్రీధర్ యాక్టివ్‌గానే పనిచేస్తున్నారు. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావుకు మళ్ళీ ఛాన్స్ ఇవ్వకూడదని అనుకుతున్నారు. అటు వినుకొండలో జివి ఆంజనేయులు, గురజాలలో యరపతినేని శ్రీనివాసరావు, చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లెలో కోడెల శివరాంలు యాక్టివ్ గానే పనిచేస్తున్నారు.

మాచర్లలో చలమారెడ్డి మాత్రం అంత దూకుడుగా ఉన్నట్లు కనిపించడం లేదు. పైగా ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హవా ఎక్కువగా ఉంది. మొత్తానికైతే నరసారావుపేటలో ఈ సారి కమ్మ నేతలు వైసీపీకి షాక్ ఇచ్చేలాగానే ఉన్నారు.

Discussion about this post