చిత్తూరు జిల్లా…శ్రీకాళహస్తి నియోజకవర్గం….తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన నియోజకవర్గం…ఇక్కడ ఎక్కువసార్లు టిడిపి జెండా ఎగిరింది. 1983, 1985, 1989, 1994, 1999, 2009, 2014 ఎన్నికల్లో టిడిపి గెలిచింది. ఇక ఇందులో అయిదుసార్లు టిడిపి తరుపున బొజ్జల గోపాలకృష్ణరెడ్డి గెలిచారు. అయితే ఆయనకు ఆరోగ్యం బాగోకపోవడంతో గత ఎన్నికల్లో….బొజ్జల తనయుడు సుధీర్ రెడ్డి టిడిపి తరుపున బరిలో దిగారు.

కానీ జగన్ గాలిలో సుధీర్ భారీ మెజారిటీ తేడాతో వైసీపీ నేత బియ్యపు మధుసూదన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. దాదాపు 38 వేల ఓట్ల మెజారిటీతో మధుసూదన్ గెలిచారు. ఇప్పటికీ శ్రీకాళహస్తిలో మధుసూదన్ హవా నడుస్తున్నట్లే కనిపిస్తోంది. అయితే సుధీర్ సైతం గట్టిగానే పోరాడుతూ పార్టీని బలోపేతం చేయడానికి పనిచేస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయాక కొన్ని రోజులు సుధీర్ అంత యాక్టివ్ గా లేరు. కానీ తర్వాత నుంచి సుధీర్ కాళహస్తిలో దూకుడుగా పనిచేయడం మొదలుపెట్టారు. వైసీపీపై పోరాటం చేస్తూనే ఉన్నారు.ఎక్కడకక్కడ కార్యకర్తలని కలుపుకునిపోతూ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు…వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నారు. అయితే ఎమ్మెల్యే మధుసూదన్ వివాదాల్లో ఎక్కువగానే ఉన్నారు. అటు కాళహస్తిలో వైసీపీ నేతల అక్రమాలు కూడా ఎక్కువగా ఉన్నాయని టిడిపి ఆరోపిస్తుంది. అయితే ఎన్ని ఆరోపణలు ఉన్నా సరే అధికార బలాన్ని పూర్తిగా వినియోగించుకోవడంలో మధుసూదన్ సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు.

అందుకే పంచాయితీ, మున్సిపాలిటీ, ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల్లో సైతం కాళహస్తిలో వైసీపీకి వన్ సైడ్‌గా విజయాలు దక్కాయి. అయితే ఈ విజయాలు అధికార బలంతోనే వచ్చాయని చెప్పొచ్చు. కానీ ఇదే వచ్చే ఎన్నికల్లో కంటిన్యూ అవ్వడం కష్టమే. పైగా కాళహస్తిపై బొజ్జల ఫ్యామిలీకి మంచి పట్టు ఉంది కాబట్టి, సుధీర్ త్వరగానే పికప్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఎన్నికల్లోపు సుధీర్ ఇంకా స్ట్రాంగ్ అయితే, మధుసూదన్‌కు చెక్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. లేదంటే కాళహస్తి మళ్ళీ మధుసూదన్ వశం అవుతుంది.
ReplyForward |
Discussion about this post