గత రెండు నెలలుగా పెద్ద సస్పెన్స్‌తో అందరిని ఊరిస్తూ వచ్చిన అక్కినేని నాగచైతన్య – సమంత విడాకులు ఎట్టకేలకు అధికారిక మయ్యాయి. వీరిద్దరు విడిపోతున్నట్టు తమ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అక్కినేని ఫ్యామిలీలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురికి పెళ్లి అచ్చిరాలేదు. అసలు పెళ్లి అనేదే అక్కినేని నాగేశ్వరరావు కొడుకు, మనవళ్లకు ఎంత మాత్రం కలిసి రాలేదు. నాగార్జున ముందుగా దివంగత లెజెండ్రీ నిర్మాత రామానాయుడు కుమార్తె శ్రీలక్ష్మిని పెళ్లాడారు. చైతన్య పుట్టాక వీరి మధ్య విబేధాలు రావడంతో తనతో కలిసి నటించిన హీరోయిన్ అమలను రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికి అఖిల్ పుట్టాడు. అటు నాగ్‌తో విడిపోయాక శ్రీ లక్ష్మి కూడా మరో పెళ్లి చేసుకుంది.

ఇక నాగార్జున ఇద్దరు కుమారులకు కూడా పెళ్లి కలిసి రాలేదు. చైతు – సమంత బంధం పదేళ్ల పాటు స్నేహం, ప్రేమ, పెళ్లి వరకు వచ్చాక కూడా ఇప్పుడు పెటాకులు అయ్యింది. ఇక నాగార్జున రెండో కుమారుడు అఖిల్‌కు – ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీకే సంస్థల యజమాని మనవరాలు శ్రీయభూపాల్‌తో అఖిల్ వివాహ నిశ్చయమైంది. ఎంగేజ్‌మెంట్ జరిగాక వీరి పెళ్లి ఇటలీలో చేయాలనుకున్నారు. అయితే వీరి మధ్య మనస్పర్థలతో వీరి బంధం పెళ్లి వరకు వెళ్లకుండానే రద్దయ్యింది. తర్వాత శ్రేయ మరో పెళ్లి చేసుకున్నా.. అఖిల్‌కు ఇప్పటి వరకు పెళ్లి కాలేదు. అఖిల్‌తో పెళ్లి క్యాన్సిల్ అయ్యాక శ్రేయ చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడిని పెళ్లాడింది.


ఏఎన్నార్ కొడుకు కుమారులే కాదు.. అటు కూతురు కుమారుడు, కుమార్తె పెళ్లి బంధం కూడా పెటాకులు అయ్యాయి. ఏఎన్నార్ కుమార్తె కుమారుడు యార్లగడ్డ సుమంత్, ఆయన సోదరి సుప్రియ కూడా సినిమాల్లోకి వచ్చారు. సుమంత్ మాజీ ఎంపీ గడ్డం గంగారెడ్డి మనవరాలు కీర్తిరెడ్డిని ( పవన్ కళ్యాణ్ తొలిప్రేమ హీరోయిన్) ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయిన యేడాదికే వీరు విడాకులు తీసుకుని అందరికి షాక్ ఇచ్చారు. ఆ తర్వాత కీర్తి మరో వ్యక్తిని పెళ్లాడి అమెరికాలో సెటిల్ అయ్యింది. సుమంత్ ఇప్పటకీ పెళ్లి చేసుకోలేదు.

ఇక సుప్రియ ఇష్టం హీరో చరణ్ రెడ్డిని ప్రేమ వివాహం చేసుకుంది. అయితే చరణ్ అలవాట్ల నేపథ్యంలో ఆమె అతడికి విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత అతడు చనిపోయాడు. సుప్రియ ఇప్పటకీ మళ్లీ పెళ్లి చేసుకోలేదు. ఇటీవల సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఏదేమైనా అక్కినేని ఫ్యామిలీలో పెళ్లి అనేది ఎందుకో కలిసి రావడం లేదు.

Discussion about this post