ఏపీ రాజకీయాల్లో ఎప్పటినుంచో టీడీపీ-జనసేన పొత్తుపై రకరకాల చర్చలు, ప్రచారాలు జరుగుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు-పవన్ కలిసి పోటీ చేయనున్నారని ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి..వైసీపీకి లాభం జరిగిందని, వైసీపీ అధికారంలోకి వచ్చిందని..ఈ సారి ఆ పరిస్తితి రాకూడదు అంటే..టీడీపీ-జనసేన తప్పనిసరిగా కలవాల్సిన పరిస్తితి ఉందని రెండు పార్టీల నేతలు భావిస్తున్నారని చెప్పవచ్చు.

అలాగే చంద్రబాబు, పవన్ సైతం పొత్తుకు రెడీగా ఉన్నారు. వారు ఇప్పటికే పొత్తుకు రెడీ అని పరోక్షంగా కామెంట్లు చేశారు. కానీ వీరి పొత్తుకు బీజేపీ అడ్డుగా మారింది. బీజేపీని కూడా కలుపుని పొత్తులో వెళ్లాలని అనుకుంటున్నారు..కానీ బీజేపీ మాత్రం చంద్రబాబుతో పొత్తు ఒప్పుకోవడం లేదు. గతంలో బాబుతో పొత్తు పెట్టుకుని మోసపోయామని, మళ్ళీ అలాంటి తప్పు చేయమని బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. అదేవిధంగా పవన్‌ని సైతం బాబుతో పొత్తు పెట్టుకోకుండా చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ ఎన్నికల్లో ఓడిపోయిన, వచ్చే ఎన్నికల్లో బలపడి అప్పుడు సత్తా చాటవచ్చని పవన్‌కు బీజేపీ సూచనలు చేస్తుందట. కానీ పవన్ మాత్రం ఈ ఎన్నికల్లోనే వైసీపీకి చెక్ పెట్టాలనే కసితో ఉన్నారు. ఆయన దాదాపు పొత్తుకు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. బీజేపీని దాదాపు పొత్తులో కలిసేలా చేయాలని చూస్తున్నారు. ఒకవేళ కుదరని పక్షంలో బీజేపీని పక్కన పెట్టి టీడీపీతో పొత్తు పెట్టుకుంటారని తెలుస్తోంది.

అయితే టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఫిక్స్ అని తాజాగా టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజా చేసిన వ్యాఖ్యలు బట్టి అర్ధమవుతుంది. తనకు తెనాలి సీటు రాసిపెట్టేమీ లేదని, చంద్రబాబు ఏ సీటు ఇస్తే ఆ సీటులో పోటీ చేస్తానని, పొత్తుల విషయం అధిష్టానం చూసుకుంటుందని, తన భవిష్యత్ కూడా బాబు చూసుకుంటారని అన్నారు. దీని బట్టి చూస్తే తెనాలి సీటు జనసేనకు ఇస్తారని తెలుస్తోంది. అక్కడ నాదెండ్ల మనోహర్ పోటీ చేయడం ఖాయమైంది. అలాగే పొత్తు కూడా ఖాయమైంది.

Leave feedback about this