రాష్ట్రంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టిడిపిల రాజకీయం…ఒక రణరంగాన్ని తలపిస్తున్నాయి. ఇప్పటికే రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరుకుంది. ఇక ఈ మాటల యుద్ధం కూడా దాటేసి….చేతల యుద్ధంలోకి వచ్చేశారు. అయితే అనూహ్యంగా అధికారంలో ఉన్న వైసీపీ…టిడిపి ఆఫీసులపై దాడులు చేసింది. టిడిపి నేత పట్టాభి, జగన్‌ని తిట్టారని చెప్పి, వైసీపీ శ్రేణులు దాడులకు దిగేస్తున్నాయి. అలా అంటే చంద్రబాబుని వైసీపీ నేతలు అనేకసార్లు తిట్టారు…కానీ టిడిపి ఇలాంటి దాడులకు దిగలేదు.

ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎందుకు దాడులకు దిగుతున్నారు? అంటే అది పక్కగా ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్ అని టిడిపి శ్రేణులు మాట్లాడుకుంటున్నాయి. ఇటీవల కూడా టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు…జగన్‌పై విమర్శలు చేశారు…అప్పుడు ఎమ్మెల్యే జోగి రమేష్…తన మందితో చంద్రబాబుపై ఇంటికి దాడికి వచ్చారని, ఇప్పుడు పట్టాభి…జగన్‌ని తిట్టారని చెప్పి…ఏకంగా టిడిపి ఆఫీసులపై దాడులకు దిగారని, ఇదంతా పక్కా స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తోందని, పైగా తిడితే దాడులు చేస్తామనే విధంగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని, అంటే భవిష్యత్‌లో కూడా ఇలాంటి దాడుల కామన్ అని ముందే వైసీపీ నేతలు హింట్ ఇచ్చేస్తున్నారని టిడిపి శ్రేణులు అనుమానిస్తున్నాయి.


2019 ఎన్నికల ముందు పీకే టీం ఎన్ని రకాల వ్యూహాలు వేసిందో తెలిసిందే అని, ఆ వ్యూహాల్లో టిడిపి చిక్కుకుని ఎన్నికల్లో ఓడిపోయిందని, కానీ ఈ సారి పీకే వలలో పడకూడదని అంటున్నాయి. పైగా పీకే స్క్రిప్ట్‌లో జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా వస్తుందని, ఎన్టీఆర్ అభిమానుల పేరుతో చంద్రబాబు, లోకేష్‌లని తిట్టించడం, అలాగే టిడిపి అభిమానుల పేరుతో ఎన్టీఆర్‌ని తిట్టించడం జరుగుతాయని చెబుతున్నారు.

గత ఎన్నికల ముందు కూడా ఇదే జరిగిందని, అలాగే పవన్ కల్యాణ్ అభిమానులు…టిడిపిని, టిడిపి వాళ్ళు ఏమో…పవన్ కల్యాణ్‌ని తిడుతున్నట్లు కూడా సృష్టిస్తారని, కాబట్టి పీకే ట్రాప్‌లో టిడిపి శ్రేణులు పడకూడదని కొందరు తెలుగు తమ్ముళ్ళు అలెర్ట్ చేస్తున్నారు.

Discussion about this post