నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేసి గెలవడం ఈ రోజుల్లో పెద్దగా జరగడం లేదనే చెప్పాలి. ఎన్ని అడ్డదారులు తోక్కైనా గెలిచి తీరాలని చూస్తున్నారు. ఇక ముఖ్యంగా అధికార పార్టీలు తమ అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి రాజకీయంగా విజయాలు సాధించాలని చూస్తున్నాయనే విమర్శలు ఎక్కువ వస్తున్నాయి. ఇక ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత ఎన్నికల్లో ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా క్రియేట్ చేసి టిడిపిని దెబ్బతీసి అధికారం దక్కించుకుంది.
ఇక ఇప్పుడు చేతులో అధికారం ఉంది..ఈ అధికార బలంతో మళ్ళీ అధికారం సొంతం చేసుకోవాలని నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్లే కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఏపీలో ఎక్కువ దొంగ ఓట్లు వస్తున్నాయనే ప్రచారం ఎక్కువైంది. అలాగే వైసీపీ వ్యతిరేక ఓట్లని పెద్ద ఎత్తున తొలగిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ దొంగ ఓట్లు అంశం తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల్లోనే ఎక్కువ వచ్చింది. పక్కనే ఉన్న తమిళనాడు..పక్క జిల్లాల నుంచి దొంగ ఓటర్లని తీసుకొచ్చి వైసీపీ దొంగ ఓట్లు వేయించుకుందని టిడిపి ఆరోపణలు చేసింది.

ఇక తర్వాత కుప్పం మున్సిపాలిటీ, ఆత్మకూరు ఉపఎన్నిక..ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టెన్త్, ఇంటర్ చదివిన వారికి కూడా ఎమ్మెల్సీ ఓటు హక్కు ఇవ్వడం సంచలమైంది. ఇటీవల గుంటూరులో ఒకే డోర్ నెంబర్ తో 500 పైనే ఓట్లు నమోడవ్వడం, తాజాగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బూత్ నెంబర్ 152 లో ఒకే డోర్ నెంబర్ 506 ఓట్లు నమోదయ్యాయని టిడిపి నేత బోండా ఉమా ఆధారాలతో సహ చూపించారు.
ఇక కుప్పం నియోజకవర్గంలో ఓ గ్రామంలో వందల కొద్ది ఓట్లు తొలగించారని తెలిసింది. అంటే టిడిపికి అనుకూలంగా ఉన్న వారి ఓట్లు తొలగించడం, కొత్తగా దొంగ ఓట్లు సృష్టించడం..ఇదే వైసీపీ పని అని టిడిపి ఆరోపిస్తుంది. నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాగైనా అడ్డదారుల్లో గెలవాలని వైసీపీ ఇలా చేస్తుందని అంటున్నారు..కాబట్టి టిడిపి నేతలు అలెర్ట్ అవ్వాలి..ప్రతి నియోజకవర్గంలో ఓటర్ల లిస్ట్ చెక్ చేసుకోవాలి.