ఔను! చంద్రబాబుకు ప్రత్యామ్నాయం లేదా? ఆయన తరహా నాయకుడు లేరనే దిశగా రాష్ట్ర ప్రజల మైం డ్ సెట్ మారుతోందా? అంటే.. ఔననే అంటున్నారు మేధావులు. ఎలా అంటే.. రాష్ట్రంలో మూడు ప్రాంతా ల్లో చంద్రబాబు పర్యటించారు. ఈ క్రమంలో ఆయన పేర్కొన్న మాట… చెప్పిన నినాదం.. రాష్ట్ర అభివృద్ధి . ఈ రెండు విషయాలతోపాటు… సంక్షేమాన్ని ఆయన కాదనలేదు. దీంతో ప్రజల ఆలోచన.. దృష్టి అంతా కూడా ఇప్పుడు చంద్రబాబుపైనే పడింది.

గడిచిన మూడేళ్లుగా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ది లేకపోవడం.. రాజధాని అంటే.. ఏదో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొనడం.. వంటి కారణాలు.. ప్రజలను నిజంగానే ఇబ్బంది పెడుతున్నాయి. అయితే.. మూడు రాజధానులు అన్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అంతేకాదు.. ఎక్కడా కూడా మూడు రాజధానులను ముందుకు తీసుకువెళ్లే పరిస్థితి కూడా లేదు. మరోవైపు.. ఎన్నికలు కూడా వస్తున్నాయి. అంటే.. ఇక, రాజధానుల విషయం తెరమరుగు అయినట్టేనని అంటున్నారు.

ఇక, రాష్ట్రంలో ఎక్కడా ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. ఉపాధి కూడా ప్రజలకు లభించలేదు.. దీంతో ప్రజ ల్లో ఎలాంటి సానుకూల పరిస్థితి కనిపించడం లేదు. ఈ క్రమంలోనే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అయితే.. మార్పు అంటే.. కేవలం ఒక పార్టీని, లేదా ఒక ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలు కోరుకోవడం లేదు. రాష్ట్రంలో చంద్రబాబు వంటి నాయకుడు అవసరమని.. ఆయన వస్తేనే ఫలితం ఉంటుందని.. ఆయన వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని.. ప్రజలు కోరుకుంటున్నారు.

ఇదే విషయాన్ని మేధావులు కూడా చెబుతున్నారు. “రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాలు కనిపించడం లేదు. ఎక్కడా కూడా.. ఎలాంటి పనులు ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రం అభివృద్ది చెందాలంటే.. ఖచ్చితంగా మార్పు రావాల్సిన అవసరం ఉంది. అది కూడా చంద్రబాబు వంటి విజన్ ఉన్న నాయకుడు అయితే.. రాష్ట్రానికి బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు. రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో మార్పువస్తేనే.. అభివృద్ధి చెందుతుంద“ని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామం..నిజంగానే వైసీపీకి తీవ్రస్థాయిలో ఎదురు దెబ్బతగిలేలా చేస్తుందని అంటున్నారు పరిశీలకులు.

Discussion about this post