ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి జోరు పెరుగుతోందా? వచ్చే ఎన్నికల నాటికి పార్టీని పూర్తిస్థాయిలో పుంజు కునేలా చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు పడుతున్నాయా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీల కులు. ఈ నేపథ్యంలోనే గతంలో పార్టీలో ఉండి.. పదవులు అనుభవించి.. తర్వాత.. ఇతర పార్టీల్లోకి వెళ్లిన వారు తిరిగి ఇప్పుడు సైకిల్ ఎక్కుతున్నారు. తాజాగా బీజేపీ నుంచి బయటకు వచ్చినరావెల కిశోర్‌బాబు.. గతంలో చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేశారు.

అయితే.. గత ఎన్నికలకు ముందు పార్టీ నుంచి బయటకు వచ్చిన రావెల.. జనసేనలో చేరారు. తర్వాత.. బీజేపీలో చేరారు. ఇటీవల ఆయన రాజీనామా చేశారు. ఈ క్రమంలో త్వరలోనే ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోవడం.. ఖాయమని అంటున్నారు. అది కూడా మహానాడు వేదికగానే.. జరుగుతుందని.. రావెల వర్గం చెబుతోంది. ఇదిలావుంటే.. ఇప్పటికే టీడీపీని వీడిన చాలా మంది నాయకులు మళ్లీ సైకిల్ ఎక్కడం ఖాయమనే చర్చ జోరుగా సాగుతోంది.

ఎందుకంటే.. ఇతర పార్టీలను గమనిస్తే.. వాటిలో భవిష్యత్తుపై భరోసా కనిపించడం లేదు. ముఖ్యంగా బీజేపీలో ఉన్న నాయకులు.. తమ భవిష్యత్తును తలుచుకుని.. కుమిలిపోతున్నారు. పార్టీకి ఎదుగుదల లేదు. పైగా.. ఇప్పటి వరకు మైనార్టీల్లో తమకు ఉన్న బలం కూడా సన్నగిల్లుతోంది. బీజేపీ నేతలుగా ముద్ర బలపడిపోతే.. వచ్చే ఎన్నికల నాటికి మైనార్టీలు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే నాయకులు మళ్లీ.. టీడీపీ చెంతకు చేరుకునేందుకు రెడీ అవుతున్నారు.

ఇదే విషయంపై టీడీపీలోనూ.. చర్చ సాగుతోంది. “వాళ్ల అవసరాల కోసం వెళ్లారు. అయితే.. పార్టీ ఎవరినీ.. దూరం చేసుకోదు. ప్రజలు ముఖ్యం. అదేసమయంలో పార్టీ కోసం.. మళ్లీ వస్తామంటే.. తీసుకుంటాం. ఎవరూ శాశ్వతంగా శతృవులు ఉండరు. ఎవరూ శాశ్వతతంగా మిత్రులు కూడా ఉండరు. రాజకీయాల్లో ఇవన్నీ సాధారణమే. అంతిమంగా ప్రజలకు సేవ చేసేవారే.. ముఖ్యం“ అని తూర్పు గోదావరి కి చెందిన మాజీ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. దీనిని బట్టి.. టీడీపీలోకి వలసలు పుంజుకుంటున్నాయనే విషయం బలంగా వినిపిస్తోంది.

Discussion about this post