ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న అమలాపురం అసెంబ్లీ స్థానంలో ఊహించని పోరు నడిచేలా ఉంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ రాజకీయం మారడం ఖాయంగా కనిపిస్తుంది. కొన్ని సమీకరణాలతో అమలాపురంలో గెలుపోటములు తారుమారు కానున్నాయి. అయితే మొదట నుంచి ఇక్కడ కాస్త కాంగ్రెస్ హవా ఉండేది. మధ్య మధ్యలో టిడిపి సత్తా చాటింది. 1994, 1999, 2014 ఎన్నికల్లో మాత్రమే ఇక్కడ టిడిపి గెలిచింది.

ఇక గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలిచింది..అయితే వైసీపీ గెలవడానికి ప్రధాన కారణం ఓట్ల చీలిక..టిడిపి..జనసేనల మధ్య ఓట్ల చీలిక భారీగా జరిగింది. ఎందుకంటే ఆ ఎన్నికల్లో వైసీపీ నుంచి పినిపే విశ్వరూప్ దాదాపు 25 వేల ఓట్ల మెజారిటీతో టిడిపిపై గెలిచారు. అప్పుడు టిడిపికి దాదాపు 46 వేల ఓట్లు పైనే పడగా, జనసేనకు 45 వేల ఓట్లు పైనే పడ్డాయి. వైసీపీకి 72 వేల ఓట్ల వరకు పడ్డాయి. అయితే ఇక్కడ టిడిపి, జనసేనకు పడిన ఓట్లు కలిపితే దాదాపు 90 వేలు పైనే..అంటే వైసీపీ కంటే 18 వేలు పైనే.
అయితే రెండు పార్టీలు విడిగా పోటీ చేయడం వల్లే గత ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. కానీ ఈ సారి ఎన్నికల్లో ఆ పరిస్తితి కనిపించడం లేదు. ప్రస్తుతం అక్కడ వైసీపీ బలం తగ్గింది. టిడిపి, జనసేన బలం పెరుగుతుంది. కానీ మూడు పార్టీల మధ్య త్రిముఖ పోరు జరిగేలా ఉంది. అంటే పొత్తు లేకుండా ఉంటే. కానీ టిడిపి-జనసేన మాత్రం కలిస్తే వైసీపీకి డ్యామేజ్ తప్పదు. అందులో ఎలాంటి డౌట్ లేదు.
టిడిపి-జనసేన మధ్య పొత్తు ఉంటూ..అమలాపురం సీటు టిడిపికి దక్కినా లేదా జనసేన దక్కినా సరే గెలుపు ఖాయమని తెలుస్తోంది. అలాగే వైసీపీకి ఓటమి పక్కా అని తెలుస్తోంది.
