జగన్ తీసుకున్న కీలక నిర్ణయం…ఇప్పుడు ఆయనకే రిస్క్ తెచ్చేలా ఉంది. రాజకీయంగా ఏదో లబ్ది వస్తుందనే కోణంలో జగన్…మూడు రాజధానుల కాన్సెప్ట్‌ని తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే ఫెయిల్యూర్ ఫార్ములాగా ఉన్న మూడు రాజధానులని ఏపీలో అమలు చేయాలని భావించారు. అందుకు తగ్గట్టుగా ముందుకెళ్లాలని చూశారు. పైగా అధికారంలో ఉండటంతో అందరూ తనకు మద్ధతుగా ఉన్నారని జగన్ అనుకున్నారు.

అందుకు తగ్గట్టుగానే స్థానిక ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆ జిల్లా, ఈ జిల్లా అనే తేడా లేకుండా ప్రతి జిల్లాల్లోనూ వైసీపీ హవా కొనసాగుతూ వచ్చింది. ఆఖరికి రాజధాని అమరావతి ఉన్న గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా వైసీపీ ఆధిక్యం కొనసాగింది. దీంతో ప్రజలు మూడు రాజధానులకు మద్ధతు ఇచ్చేశారని వైసీపీ నేతలు ప్రచారం చేసుకున్నారు. కానీ అమరావతి ప్రాంత రైతులు, ప్రజలు రాజధాని ఉద్యమాన్ని మాత్రం అపలేదు. గత రెండేళ్లుగా అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇక వారిని అణిచివేయాలని వైసీపీ ప్రభుత్వం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిందో అందరికీ తెలిసిందే. అమరావతిని చెక్ పెట్టాలని చూస్తూనే ఉంది. కానీ రైతులు, ప్రజలు మాత్రం వదలకుండా పోరాడుతున్నారు. అయితే ఇప్పుడుప్పుడే అమరావతికి ప్రజల మద్ధతు పెరుగుతుంది. జగన్ ఎలాగో మూడు రాజధానులని ఒక దారి చేయలేదు. అసలు ఇంతవరకు ఏపీకి రాజధాని ఏది అని తెలియని పరిస్తితి.

దీనిపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఇటు అమరావతి కోసం పాదయాత్ర చేస్తున్న రైతులకు, ప్రజలకు పెద్ద ఎత్తున మద్ధతు వస్తుంది. తాజాగా బీజేపీ సైతం అమరావతి రైతులకు మద్ధతు ఇచ్చింది. అమరావతినే రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. దీని బట్టి చూస్తే అమరావతితో పోలిటికల్ సీన్ పూర్తిగా మారిపోయేలా కనిపిస్తోంది. అమరావతితోనే వైసీపీకి గట్టి డ్యామేజ్ అయ్యేలా ఉంది. ఇప్పుడు కాకపోయినా వచ్చే ఎన్నికల్లో అమరావతి ప్రభావం వైసీపీపై బాగా ఉంటుందని చెప్పొచ్చు.

Discussion about this post