ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడుగా ఉన్న అంబటి రాంబాబు..ఈ సారి ఎన్నికల్లో గెలవడం చాలా కష్టమయ్యేలా ఉందని చెప్పొచ్చు. ఎప్పుడో 1989లో ఒకసారి గెలిచిన అంబటి…మళ్ళీ జగన్ గాలిలో 2019 ఎన్నికల్లో గెలిచిన విషయం తెలిసిందే. అయితే అలా జగన్ గాలిలో గెలిచిన అంబటి…ఈ రెండున్నర ఏళ్లలో సత్తెనపల్లి నియోజకవర్గానికి చేసింది శూన్యం. అందుకే ఈ సారి ఎన్నికల్లో ఆయన గడ్డు పరిస్తితి ఎదురుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

పైగా అనేక వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ నెగిటివ్‌ని పోగొట్టుకోవడానికి అంబటి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఆయన..తన సొంత సామాజికవర్గం కాపులని మెప్పించే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నారు. ఎందుకంటే అంబటి కూడా కాపు వర్గమైన సరే…ఆ వర్గం ప్రజలు అంబటిపై అంత పాజిటివ్‌గా ఉండరు. ఎందుకంటే ఆ వర్గానికి అంబటి చేసింది శూన్యం…పైగా వారిపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారు.

దీంతో కాపు వర్గం అంబటికి బాగా యాంటీగా ఉన్నారు. ఆ యాంటీని పోగొట్టుకోవడానికి అంబటి…ముద్రగడ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. కాపుల కోసం ఆయన తెగ పోరాటం చేసారని, కానీ ఆయన్ని చంద్రబాబు నానా హింసలు పెట్టేశారని ఎక్కడపడితే అక్కడ చెబుతున్నారు. ఇక ముద్రగడ కాపుల కోసం పోరాడారో, జగన్ కోసం పోరాడారో జనాలకు బాగా తెలుసు. ఎవరు ఎవరిని ఇబ్బంది పెట్టారో కూడా తెలుసు…చంద్రబాబుని నెగిటివ్ చేయడానికి ముద్రగడ చేయని ప్రయత్నాలు లేవు.

అందుకే గత ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయి, జగన్ అధికారంలోకి రాగానే ముద్రగడ కాపు ఉద్యమం లేదు…ఏమి లేదని ఇంట్లో కూర్చున్నారు. కానీ అదే ముద్రగడని అడ్డం పెట్టుకుని బెనిఫిట్ పొందాలని అంబటి తెగ ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ పనులన్నీ వర్కౌట్ కావనే చెప్పాలి…అంబటికి కాపులు యాంటీగానే ఉన్నారు…సొంత వర్గమే యాంటీగా ఉంటే మిగిలిన వర్గాల పరిస్తితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అంటే మొత్తం మీద ఈ సారి అంబటి పని అస్సాం అయ్యేలా ఉంది.

Discussion about this post