వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం దిశగా వెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వైసీపీపై పెరుగుతున్న వ్యతిరేకత టిడిపికి కలిసొస్తుంది. దీంతో టిడిపి హవా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక గత ఎన్నికల్లో గెలిచిన టిడిపి ఎమ్మెల్యేలు మళ్ళీ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాదాపు అందరూ మళ్ళీ గెలిచే ఛాన్స్ కనిపిస్తుంది. ఒకరిద్దరు తప్ప అంతా గెలుపు గుర్రం ఎక్కేలా ఉన్నారు.
అలా గెలుపుకు దగ్గరగా ఉన్నవారికి రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ముందు వరుసలో ఉన్నారని చెప్పవచ్చు. బాపట్ల జిల్లా పరిధిలో ఉన్న ఈ ఎమ్మెల్యేలు మళ్ళీ టిడిపి జెండా ఎగరవేయడం ఖాయమని తెలుస్తోంది. ఈ ఇద్దరు తొలిసారి 2014 ఎన్నికల్లో గెలిచారు. అనగాని రేపల్లె నుంచి, ఏలూరి పర్చూరు నుంచి గెలిచారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు తమ స్థానాల్లో అభివృద్ధి బాగా చేశారు..సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండేవారు.

అందుకే 2019 ఎన్నికల్లో వైసీపీ గాలి ఉన్నా సరే ఈ ఇద్దరు మళ్ళీ గెలిచారు. రేపల్లె, పర్చూరులో టిడిపి జెండా ఎగిరింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎన్ని ఇబ్బందులు ఎదురైన టిడిపిలో నిలబడ్డారు. పార్టీ కోసం పనిచేస్తు వస్తున్నారు. వీరికి జగన్ ఏదొక విధంగా చెక్ పెట్టాలని చూస్తూ వచ్చారు..కానీ ఎక్కడ కూడా వారి బలాన్ని తగ్గించలేకపోయారు. మళ్ళీ ఆ ఇద్దరు గెలిచి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని తేలింది.
లేటెస్ట్ సర్వేలో రేపల్లెలో అనగాని, పర్చూరులో ఏలూరి గెలవడం ఫిక్స్ అని తేలింది..అందులో ఏ మాత్రం డౌట్ లేదనే చెప్పవచ్చు. ఈ ఇద్దరు స్నేహితులు వైసీపీకి చెక్ పెట్టి హ్యాట్రిక్ కొట్టనున్నారు.
