అధికార వైసీపీలో కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్న విషయంలో ఎలాంటి డౌట్ లేదు. పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం, అనుకున్న విధంగా నిధులు ఇవ్వకపోవడం, ప్రజలకు కావల్సిన పనులు చేసి పెట్టడంలో..ఇలా రకరకాల అంశాల విషయంలో సొంత ప్రభుత్వంపైనే ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. ఇందులో ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి లాంటి వారు ఓపెన్ గానే సొంత ప్రభుత్వంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

అందుకే ఆనంని వైసీపీ నిదానంగా సైడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయనని తప్పించి వెంకటగిరి బాధ్యతలని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి అప్పగించారు. అలాగే ఆనం సెక్యూరిటీ తగ్గించారు. అటు గడపగడపకు ఇంకా తిరగాల్సిన అవసరం లేదన్నట్లు వైసీపీ అధిష్టానం ఆనంకు స్పష్టం చేసినట్లు కనిపిస్తోంది. దీంతో ఆనం వైసీపీ నుంచి బయటకు వెళ్ళడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన టీడీపీతో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. టీడీపీలోకి వస్తే ఆయనకు ఆత్మకూరు లేదా నెల్లూరు సిటీ సీటు దక్కుతుందని ప్రచారం వస్తుంది.

ఓ వైపు ఆనం వైసీపీకి దూరమవుతుంటే…మరోవైపు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సైతం వైసీపీకి దూరం అవుతున్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ ఎన్నికల్లో ఆయనకు సీటు గ్యారెంటీ లేదు. దీంతో ఆయన వైసీపీని వీడి టీడీపీలోకి రావడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. మైలవరం సీటు జోగి రమేశ్‌కు ఇస్తారనే ప్రచారం ఉంది. దీంతో వసంత గడపగడపకు వెళ్ళడం లేదు.ఇక ఈయన టీడీపీ వైపుకు వస్తారని, టీడీపీలో ఏదొక సీటు వసంత ఖాయమని ప్రచారం వస్తుంది. మొత్తానికి వైసీపీ ఎమ్మెల్యేలకు టీడీపీలో సీట్లు ఫిక్స్ అయ్యేలా ఉన్నాయి.

Leave feedback about this