అనంతపురం టీడీపీలో ఇంకా ఆధిపత్య పోరు నడుస్తోందా? కాల్వ శ్రీనివాసులు, జేసీ ఫ్యామిలీ మధ్య లుకలుకలు ఇంకా తగ్గలేదా? అంటే తగ్గలేదనే తెలుస్తోంది. ఆ మధ్య జేసీ ప్రభాకర్ రెడ్డి..కొందరు టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని మాట్లాడిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు కూడా ఘాటుగానే స్పందించారు. అలాగే అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడుగా కాల్వ…పార్లమెంట్ కమిటీలో జేసీ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. అటు జేసీ ఫ్యామిలీ సపోర్ట్ ఉన్న శింగనమల ఇంచార్జ్ బండారు శ్రావణి వర్గానికి కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు.


శింగనమలలో ఎస్సీ నేతలని పక్కనబెట్టి…అగ్రవర్గాల నేతలకు పెత్తనం ఇవ్వడంపై శ్రావణి ఫైర్ అయిన విషయం తెలిసిందే. ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గంలో అగ్రవర్గాల పెత్తనం ఏంటని..నియోజకవర్గ ఎస్సీ నేతలు…కాల్వపై ఫైర్ అవుతున్నారు. దీనిపై లోకేష్ అనంత జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు నిలదీయాలని చూశారు గానీ, లోకేష్‌తో మాట్లాడటం కుదరలేదు. అయితే అంతకముందు శ్రావణి ఈ అంశంపై…పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు ఫిర్యాదు చేశారు.

కానీ అచ్చెన్న కూడా దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు కనిపించలేదు. ఈ క్రమంలోనే శ్రావణి..నియోజకవర్గానికి పూర్తిగా దూరమయ్యారు. మొన్నటివరకు యాక్టివ్‌గా పనిచేసిన ఆమె..ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. అసలు నియోజకవర్గంలో యాక్టివ్ గా పనిచేయడం లేదు. ఆఖరికి భువనేశ్వరి ఇష్యూపై టీడీపీ నేతలు అంతా స్పందించారు. కానీ శ్రావణి ఎక్కడా కూడా స్పందించలేదు. సోషల్ మీడియాలో కూడా ఆమె యాక్టివ్‌గా ఉండటం లేదు.

మరి ఈ పరిస్తితి చూస్తుంటే శ్రావణి..టీడీపీలో కాస్త దూరం జరిగినట్లే కనిపిస్తోంది. అదే సమయంలో టిక్కెట్ ఇష్యూ కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. శ్రావణికి టిక్కెట్ రాకుండా చేయాలని అనంతలో కొందరు సీనియర్లు ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు శింగనమల సీటు దక్కించుకోవాలని ఎంఎస్ రాజు గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఈ పరిణమాల నేపథ్యంలోనే శ్రావణి సైలెంట్ అయినట్లు తెలుస్తోంది.

Discussion about this post