వైసీపీ కంచుకోటగా ఉన్న ఉమ్మడి నెల్లూరు జిల్లాపై టిడిపి నిదానంగా పట్టు సాధిస్తున్న విషయం తెలిసిందే. గత రెండు ఎన్నికల్లో వైసీపీ హవా నడిచిన ఈ జిల్లాలో..టిడిపి బలం పెరుగుతుంది. ఇప్పటికే అక్కడ వైసీపీపై వ్యతిరేకత పెరిగింది..ఈ క్రమంలోనే ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి దూరం అవ్వడం పెద్ద షాక్. అది కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లాంటి సీనియర్లు వైసీపీకి దూరం అయ్యారు. ఇక వీరు టిడిపిలో చేరే అవకాశాలు ఉన్నాయి.
అలాగే పలు స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత స్పష్టంగా ఉంది. అయితే ఆ ఎమ్మెల్యేల చేరికతో టిడిపికి బలం పెరిగే ఛాన్స్ ఉంది. అదే సమయంలో వారికి సీట్లు కూడా ఫిక్స్ అవుతున్నాయి. మేకపాటి విషయం పక్కన పెడితే..కోటంరెడ్డికి తన సిట్టింగ్ సీటు నెల్లూరు రూరల్ ఫిక్స్. ఇక ఆనం విషయంలో టిడిపి ఊహించని స్కెచ్ వేస్తుంది. అసలు జిల్లాపై ఎక్కువ పట్టున్న ఆనంని..ఎంపీగా బరిలో దింపి వైసీపీకి చెక్ పెట్టాలని చూస్తుంది.

ప్రస్తుతం ఆనం ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరిలో టిడిపి నేత కురుగొండ్ల రామకృష్ణ ఉన్నారు..దీంతో ఆనం..తన సొంత సీటు ఆత్మకూరు అడుగుతున్నారు. ఇక ఆ సీటుని ఆనం కుమార్తె కైవల్య రెడ్డికి ఇచ్చి..ఆనంని నెల్లూరు ఎంపీగా బరిలో దింపాలని చూస్తున్నారు. అటు వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి..ఈ సారి ఎన్నికల్లో నెల్లూరు రూరల్ లో పోటీ చేయవచ్చు. దీంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి..నెల్లూరు ఎంపీగా పోటీ చేయవచ్చు.
ఇక వైసీపీకి చెక్ పెట్టాలంటే ఆనం..ఎంపీగా పోటీ చేస్తే..పార్లమెంట్ సీటు
తో పాటు..పార్లమెంట్ పరిధిలో ఉండే అసెంబ్లీ సీట్లలో ప్రభావం ఉంటుందని, మెజారిటీ సీట్లు దక్కించుకోవచ్చు అనేది టిడిపి ప్లాన్. చూడాలి మరి ఆనంతో టిడిపి ఎలాంటి స్కెచ్ వేస్తుందో.
