అధికారం ఉంది కదా అని..అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యవస్థలని వాడుకుని ప్రతిపక్షాలని అణిచివేయాలని చూస్తే తిరుగుబాట్లు వస్తాయి తప్ప..ప్రతిపక్షాలని అణిచివేయడం జరిగే పని కాదు. అలా అణిచేవేసే కార్యక్రమాలు చేస్తే ప్రజల్లో ప్రతిపక్షాలపై సానుభూతి పెరుగుతుంది. ఇప్పుడు ఏపీలో ప్రతిపక్ష టిడిపిపై అదే సానుభూతి పెరుగుతుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టిడిపిని ఎన్ని రకాలుగా అణిచివేయాలని ప్రయత్నాలు జరిగాయో చెప్పాల్సిన పని లేదు.

అధికారాన్ని అడ్డం పెట్టుకుని టిడిపి నేతలని నానా తిప్పలు పెట్టారు. అక్రమ కేసులు, ఆర్ధికంగా దెబ్బతీసే కార్యక్రమాలు జరిగాయి. ఇక చంద్రబాబుని ఎన్ని రకాలుగా టార్గెట్ చేశారో తెలిసిందే. ఆయన్ని అడుగడుగున అవమానిస్తూనే వచ్చారు. నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన వారు కూడా చంద్రబాబుని బూతులు తిట్టడం జగన్ ముందు మార్కులు కొట్టేయడం, పదవులు పొందడం చేస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల బాబు వెనక్కి తగ్గలేదు..ఇంకా దూకుడుగా పనిచేస్తున్నారు. పైగా ఆయనపై ప్రజల్లో సానుభూతి పెరిగి..ఆయన బలం మరింత పెరుగుతూ వస్తుంది.

అయినా సరే జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. బాబుని ఏ విధంగానైనా అడ్డుకోవాలనే చూస్తున్నారు. తాజాగా అనపర్తిలో బాబుని పోలీసులు ఏ విధంగా అడ్డుకోవాలని చూశారో చెప్పాల్సిన పనిలేదు. మొదట అనపర్తి సభకు పర్మిషన్ ఇచ్చి..తర్వాత రద్దు అయిందని చెప్పారు. అయినా బాబు వెనక్కి తగ్గలేదు. కాన్వాయ్‌ని ఆపిన సరే నడుచుకుంటూ ముందుకెళ్లారు. సభలో పాల్గొన్నారు. సభలో భారీ ఎత్తున జనం వచ్చారు.

అనపర్తిలో టోటల్ చంద్రబాబు వన్ మ్యాన్ షో నడిచింది. ఇలా అడ్డుకుని బాబు ఇమేజ్‌ని జగన్ పెంచారని చెప్పవచ్చు. ఇలా బాబు బలాన్ని పెంచుతూ జగన్ బలాన్ని తగ్గించుకుంటున్నారు.
