రాయలసీమ జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి కాస్త అనుకూలమైన జిల్లా ఏదైనా ఉందంటే అది..అనంతపురం జిల్లానే. ఇంకా చెప్పాలంటే టీడీపీకి కంచుకోట. ఇక్కడ టీడీపీకి కంచుకోటల్లాంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. కానీ గత ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయింది. అయితే ఆ ఎన్నికల ఫలితాల తర్వాత అనంతలో టీడీపీ త్వరగానే పికప్ అవుతూ వచ్చింది. రాయలసీమలో మిగతా జిల్లాలతో పోలిస్తే..అనంతలో టీడీపీ పుంజుకుంది.

పలు నియోజకవర్గాల్లో టీడీపీకి మంచి దొరికింది. కానీ కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ పుంజుకోవాల్సి ఉంది. ఇప్పటికీ ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి పట్టు దొరకడం లేదు. గత ఎన్నికల్లో హిందూపురం, ఉరవకొండ మినహా మిగిలిన 12 నియోజకవర్గాల్లో టీడీపీ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ రెండున్నర ఏళ్లలో ఓడిన 12 సీట్లలో టీడీపీ, కొన్ని చోట్ల పుంజుకుంది. తాడిపత్రి, కదిరి లాంటి నియోజకవర్గాల్లో త్వరగా పికప్ అయింది.

అలాగే పుట్టపర్తి, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో పార్టీ బలం పుంజుకుంది. అయితే ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఇంకా పుంజుకోవాల్సి ఉంది. పరిటాల ఫ్యామిలీ చేతుల్లో ఉన్న రాప్తాడులో టీడీపీ పరిస్తితి కాస్త మెరుగైంది..కానీ ఇంకా ఇక్కడ టీడీపీ బలపడాలి. అలాగే ధర్మవరంలో కూడా టీడీపీ పుంజుకోవాలి. ఇక అనంతపురం అర్బన్‌లో పార్టీ బలపడినట్లు కనిపించడం లేదు. అదేవిధంగా రాయదుర్గం, మడకశిర నియోజకవర్గాల్లో పార్టీకు పెద్ద పట్టు దొరకలేదు.

రాయదుర్గంలో సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు ఉన్నా సరే పూర్తి స్థాయిలో పార్టీ బలపడలేదు. అటు కంచుకోట అయిన పెనుకొండలో టీడీపీ పరిస్తితి మెరుగైనట్లు కనిపించడం లేదు. ఇటీవల పెనుకొండ మున్సిపాలిటీలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. అలాగే శింగనమల నియోజకవర్గంలో టీడీపీకి పెద్ద పట్టు దొరికినట్లే కనిపించడం లేదు. ఇక్కడ టీడీపీలో ఆధిపత్య పోరు నడుస్తోంది. దీని వల్ల శింగనమలలో టీడీపీకి ఏది కలిసిరావడం లేదు. అంటే అనంతలో సగం నియోజకవర్గాల్లో టీడీపీ పికప్ అవ్వాల్సిన అవసరం ఉంది.

Discussion about this post