కంచుకోట అనంతపురం టీడీపీలో ఆధిపత్య పోరు ఆగినట్లు కనిపించడం లేదు. నేతల మధ్య రచ్చ కంటిన్యూ అవుతున్నట్లే కనిపిస్తోంది. ఈ రచ్చ వల్ల పార్టీకే డ్యామేజ్ జరిగేలా ఉంది. ఇప్పుడుప్పుడే అనంతలో టీడీపీ పుంజుకుంటుంది.చాలా నియోజకవర్గాల్లో పార్టీ పికప్ అయింది. ఇలాంటి తరుణంలో కలిసికట్టుగా పనిచేసి ఇంకా పార్టీని బలోపేతం చేయాల్సిన నేతలు…ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించుకుంటూ…పార్టీని ఇబ్బంది పెడుతున్నారు.

అసలు అనంతలో జేసీ వర్గానికి, కాల్వ వర్గానికి పెద్దగా పడటం లేదు. అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడుగా ఉన్న కాల్వ శ్రీనివాసులు అంటే జేసీ ఫ్యామిలీకి పడటం లేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి డైరక్ట్‌గానే కాల్వపై విమర్శలు చేసిన సందర్భం ఉంది. దీంతో కాల్వ…జేసీ సొంత నియోజకవర్గం తాడిపత్రిలో జేసీ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇటు శింగనమలలో జేసీ వర్గానికి చెందిన బండారు శ్రావణికి కూడా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇప్పటికీ నేతల మధ్య రచ్చ కొనసాగుతుంది.

ఇది ఇలాగే కొనసాగితే నెక్స్ట్ ఎన్నికల్లో ప్రత్యర్ధిగా ఉన్న వైసీపీ టీడీపీకి చెక్ పెట్టాల్సిన అవసరం లేదు. సొంత టీడీపీ నేతలే చెక్ పెట్టేలా ఉన్నారు. ఇప్పుడు జేసీ ఫ్యామిలీకి..అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరీకి పెద్దగా పడటం లేదు. జేసీ ఫ్యామిలీ అనంత సిటీ రాజకీయంలో జోక్యం చేసుకుంటుందని ప్రభాకర్ సీరియస్‌గా ఉన్నారు. అందుకే ఆయన, కాల్వతో కలిసి తాడిపత్రి విషయంలో జోక్యం చేసుకుంటున్నారు. ఇటు శింగనమలలో సైతం శ్రావణికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు.

అయితే జేసీ ఫ్యామిలీకి అనంత సిటీపై పట్టు ఉంది. అక్కడ గానీ వారు వ్యతిరేకమైతే ప్రభాకర్ చౌదరీకి ఇబ్బంది. అలాగే కాల్వ సొంత నియోజకవర్గం రాయదుర్గంలో కూడా జేసీ వర్గం ఉంది. అక్కడ కూడా అపోజిట్ అయితే ఇబ్బందులు తప్పవు. ఇలా ఎక్కడకక్కడే గ్రూప్ తగాదాలు వల్ల గెలవాల్సిన అనంతలో టీడీపీ దెబ్బతినేలా ఉంది.


Discussion about this post