అధికార వైసీపీలో రెడ్డి వర్గం నాయకుల హవా ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. అందులోనూ రాయలసీమ జిల్లాల్లో పూర్తిగా రెడ్డి నేతలదే డామినేషన్. అందుకే సీమలో వైసీపీ హవా ఎక్కువగా ఉంటుంది. గత రెండు ఎన్నికల్లో సీమలో వైసీపీ హవా కొనసాగడానికి కారణం రెడ్డి నేతలే. వారే వైసీపీకి ప్రధాన బలం. ఇక వారికి చెక్ పెడితే ఆటోమేటిక్‌గా వైసీపీకి చెక్ పడుతుందనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే వైసీపీ రెడ్డి ఎమ్మెల్యేలకు చెక్ పెట్టేందుకు టీడీపీ రెడీ అయింది.

అయితే సీమలో ఉన్న నాలుగు జిల్లాల్లో అనంతపురంలోనే కాస్త టీడీపీ ఎక్కువ దూకుడుగా ఉంది..ఇక్కడ రెడ్డి ఎమ్మెల్యేలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. అనంతలో 14 సీట్లు ఉండగా…వైసీపీ 12 సీట్లు గెలుచుకుంది. ఈ 12లో 7 గురు రెడ్డి ఎమ్మెల్యేలే. తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి, ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి, కదిరిలో సిద్ధారెడ్డి, అనంతపురం అర్బన్‌లో అనంత వెంకట్రామి రెడ్డి, పుట్టపర్తిలో శ్రీధర్ రెడ్డి, గుంతకల్లులో వై. వెంకట్రామిరెడ్డి, రాప్తాడులో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిలు ఉన్నారు.






ఇలా 12 మందిలో 7 గురు రెడ్డి ఎమ్మెల్యేలే ఉన్నారు. అయితే ఈ రెడ్డి ఎమ్మెల్యేలకు చెక్ పెటాడానికి టీడీపీ నేతలు కూడా గట్టిగానే కష్టపడుతున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలని డామినేట్ చేసేలా టీడీపీ నేతలు వచ్చారు. పుట్టపర్తిలో పల్లె రఘునాథ్ రెడ్డి, కదిరిలో కందికుంట ప్రసాద్, తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి, రాప్తాడులో పరిటాల ఫ్యామిలీ దూకుడుగా పనిచేస్తున్నాయి.




అలాగే ధర్మవరంలో పరిటాల శ్రీరామ్, అనంతలో ప్రభాకర్ చౌదరి, గుంతకల్లులో జితేంద్ర గౌడ్‌లు పనిచేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా వారు ముందుకెళుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలతో ఢీ అంటే ఢీ అనేలా టీడీపీ నేతలు వచ్చారు. మొత్తానికైతే ఎన్నికల్లో కొందరు వైసీపీ రెడ్డి ఎమ్మెల్యేలకు టీడీపీ నేతలు చెక్ పెట్టేలా ఉన్నారు.



Discussion about this post