ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది..రాయలసీమ నలుగురు జిల్లాల్లో టిడిపికి బలం ఉంది ఈ జిల్లాలోనే. అలాంటి జిల్లాలో గత ఎన్నికల తర్వాత టిడిపి పరిస్తితి అంత ఆశాజనకంగా లేదు. రాష్ట్రంలో వైసీపీపై వ్యతిరేకత వస్తూ..టిడిపి బలపడుతున్న సరే అనంతపై టిడిపికి ఇంకా పట్టు దొరకడం లేదు. కొన్ని సీట్లలో టిడిపి ఇంకా వెనుకబడే ఉంది.
అయితే 2014 ఎన్నికల్లో జిల్లాలో 14 సీట్లు ఉంటే టిడిపి 12 సీట్లు గెలుచుకుంది..వైసీపీకి 2 సీట్లు మాత్రమే వచ్చాయి. కదిరి, ఉరవకొండ సీట్లలో టిడిపి ఓడిపోయింది. మిగిలిన సీట్లని గెలుచుకుంది. అయితే అప్పుడు ఉన్న పరిస్తితి కూడా ఇప్పుడు కనిపించడం లేదు. జిల్లాలో టిడిపి ప్రస్తుతానికి ఆధిక్యంలో ఉన్న సీట్లు వచ్చి..హిందూపురం, ఉరవకొండ, కదిరి, పెనుకొండ, కళ్యాణదుర్గం, తాడిపత్రి, అనంతపురం అర్బన్ సీట్లు.

ఇక రాప్తాడు, పుట్టపర్తి, శింగనమల స్థానాల్లో పుంజుకుంటూ ఉంది. ఇకొంచెం కష్టపడితే ఈ స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. కానీ మడకశిర, ధర్మవరం, గుంతకల్ సీట్లలో టిడిపి ఏ మాత్రం బలపడలేదు. ఈ సీట్లలో టిడిపి మళ్ళీ ఓడిపోయే పరిస్తితి కనిపిస్తుంది. అటు రాయదుర్గంలో కూడా టిడిపి ఇంకా బలపడాలి. సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు ఉన్నారు గాని..ఇంకా ఆయనకు పట్టు దొరకట్లేదు.
అంటే అనంతలో టిడిపి ఇంకా బలపడాలి. కనీసం 2014 ఎన్నికల్లో గెలిచిన సీట్లు కూడా 2024 ఎన్నికల్లో గెలిచేలా లేదు. అయితే ఇప్పుడు జిల్లాలో లోకేష్ పాదయాత్ర జరుగుతుంది. ఆ పాదయాత్రకు భారీ ఎత్తున ప్రజా స్పందన వస్తుంది. దీని వల్ల జిల్లాలో టిడిపికి కొత్త ఊపు వచ్చి..2014 ఎన్నికలని రిపీట్ చేస్తుందేమో చూడాలి.
