Site icon Neti Telugu

అనంతలో ఆ సీట్లు మళ్ళీ వదులుకోవాల్సిందేనా?

ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందనే సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో జిల్లాలో టి‌డి‌పి దారుణంగా ఓడిపోయింది గాని..  ఆ తర్వాత త్వరగానే పికప్ అవుతూ వచ్చింది. చాలా నియోజకవర్గాల్లో పార్టీ ఊహించని విధంగా పుంజుకుంటూ వచ్చింది. అంటే టి‌డి‌పికి బలమైన ప్రాంతం కాబట్టే..త్వరగా పుంజుకోగలిగింది. కానీ ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ పికప్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ కొన్ని స్థానాల్లో పార్టీ వెనుకబడే ఉంది.

నాయకులు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కొన్ని స్థానాల్లో పార్టీ పరిస్తితి బాగోలేదనే చెప్పాలి. ఇదే పరిస్తితి కొనసాగితే మళ్ళీ ఆ స్థానాల్లో టి‌డి‌పి గెలవడం కష్టమనే చెప్పాలి. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఉన్న 14 స్థానాల్లో వైసీపీ 12 గెలుచుకోగా, టి‌డి‌పి 2 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. అయితే నిదానంగా వైసీపీ గెలుచుకున్న కొన్ని స్థానాల్లో టి‌డి‌పి బలపడింది. కానీ కొన్ని చోట్ల పార్టీ ఇంకా బలపడాలి.

మడకశిర, గుంతకల్లు, శింగనమల, పుట్టపర్తి, అనంతపురం అర్బన్ లాంటి సీట్లలో పార్టీ వెనుకబడింది. కొన్ని చోట్ల నేతల మధ్య అంతర్గత విభేదాలు ఉండటం టి‌డి‌పికి బాగా మైనస్ గా మారింది. మడకశిరలో నేతల మధ్య విభేదాలు ఎక్కువ ఉన్నాయి. అసలు ఈ స్థానంలో పార్టీ పికప్ అవ్వలేదు. అటు గుంతకల్లులో టి‌డి‌పి ఇంచార్జ్ గా ఉన్న జితేందర్ గౌడ్ అనుకున్న మేర పనిచేయడం లేదు. దీంతో ఇక్కడ కూడా పార్టీ వెనుకబడింది. శింగనమలలో ఇంచార్జ్ బండారు శ్రావణికి వ్యతిరేకంగా కొందరు టి‌డి‌పి నేతలు పనిచేస్తున్నారు. అర్బన్ లో కూడా పార్టీలో లుకలుకలు ఉన్నాయి.

ఇలా పార్టీ నేతలు సరిగ్గా పనిచేయకపోవడం, నేతల మధ్య విభేదాలు ఉండటం టి‌డి‌పికి బాగా మైనస్ గా మారింది. ఇదే పరిస్తితి ఉంటే నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఆ స్థానాల్లో టి‌డి‌పి గెలవడం కష్టమే.  

Exit mobile version