గత ఎన్నికల ముందు జగన్ కోసం ఎంతమంది సినిమా యాక్టర్లు ప్రచారం చేశారో అందరికీ తెలిసినే. జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి సీనియర్ ఆర్టిస్టుల వరకు జగన్ గెలుపు కోసం ప్రచారం చేశారు. ఇదే క్రమంలో సీనియర్ నటుడు పోసాని కృష్ణమురళి..జగన్ కోసం గట్టిగానే కష్టపడ్డారు. ప్రచారంలో తిరుగుతూనే ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు పెడుతూ…చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసేవారు.

ఇక జగన్ అధికారంలోకి వచ్చాక కూడా పోసాని…అప్పుడప్పుడు మీడియా ముందుకొచ్చి హడావిడి చేస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే జగన్ ప్రభుత్వంపై బాగా నెగిటివ్ పెరిగిపోతుందో..అప్పుడు టాపిక్ మొత్తం డైవర్ట్ చేయడానికి…బాబు, పవన్‌లపై విమర్శలు చేస్తారు. ఇలా ఎక్కడకక్కడ జగన్ కోసం కష్టపడుతూనే ఉన్న పోసానిపై టీడీపీ నేతలు ఫైర్ అయ్యే పరిస్తితి. అటు సోషల్ మీడియాలో సైతం పోసాని ఎక్కడ ఉన్నారా? అని ప్రశ్నిస్తున్నారు.

జగన్‌కు ఒక్క చాన్స్ ఇవ్వాలని, గెలిచిన తర్వాత పరిపాలన బాలేకపోతే తన ఇంటికి వచ్చి చెప్పుతో కొట్టాలని పోసాని అన్నారని, మరి జగన్ పరిపాలన చూసిన తర్వాత పోసానిని, ఇంటికి వచ్చి కొట్టాలా? లేదా ఏదైనా సెంటర్‌కు వచ్చి కొట్టించుకుంటారా? అని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.

అయితే అయ్యన్న మాత్రమే కాదు..సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోసాని వ్యాఖ్యలపై చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఒకసారి జగన్ పాలన బాగుందో లేదో..పోసాని క్షేత్ర స్థాయిలో జనం దగ్గరకు వెళ్ళి కనుక్కోవాలని చెబుతున్నారు. అయితే ఈ మధ్య పోలిటికల్ స్క్రీన్‌పై కనిపించడం లేదు…మీడియాలో కూడా పెద్దగా కనిపించడం లేదు. ఆ మధ్య పవన్ కల్యాణ్ ఇష్యూ జరిగిన దగ్గర నుంచి పోసాని అడ్రెస్ లేకుండా ఉన్నారు.

అప్పుడు పవన్‌పై పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ ఫ్యాన్స్..పోసానిపై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన విషయం తెలిసిందే. అలాగే పోసాని కుటుంబంపై కూడా కామెంట్లు చేశారని చెప్పారు. మరి అప్పటినుంచే పోసాని ఎవరికి కనిపించడం లేదు. భవిష్యత్‌లో మళ్ళీ ఏపీ పాలిటిక్స్‌లో జోక్యం చేసుకుంటారో లేదో చూడాలి.

Discussion about this post