అధికార వైసీపీలో అంతర్గత పోరు ఎక్కువగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి జిల్లాలోనూ ఈ ఆధిపత్య పోరు నివురుగప్పిన నిప్పు మాదిరిగా ఉంది. అయితే కొన్ని స్థానాల్లో ఈ పోరుకు చెక్ పెట్టడానికి వైసీపీ అధిష్టానం ప్రయత్నిస్తుంది. నేతలకు సర్దిచెబుతుంది. కానీ అనుకున్న స్థాయిలో పరిస్తితి సర్దుబాటు కావడం లేదు. ఈ పోరు వల్ల పరోక్షంగా వైసీపీకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇక ఉమ్మడి నెల్లూరులో ఈ పోరు మరింత ఎక్కువ ఉంది. మొత్తం అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. కొన్ని స్థానాల్లో నేతల మధ్య రచ్చ జరుగుతుంది..సొంత నేతలపైనే కుట్రలు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి వైసీపీ ప్రభుత్వానికి యాంటీ అయ్యారు. ఇటు గూడూరులో ఎమ్మెల్యే వరప్రసాద్‌పై సొంత నేతలే తిరుగుబాటు చేస్తున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సైతం..తనపై సొంత నేతలు కుట్రలు చేస్తున్నారని ఆ మధ్య వ్యాఖ్యలు చేశారు.



ఇదే క్రమంలో తాజాగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సైతం…వైసీపీలో కొందరు నేతలు తనని దెబ్బకొట్టాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. టీడీపీ నేతలతో కలిసి కుట్రలు పన్నుతున్నారని అంటున్నారు. ఇప్పటికే మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, ఆనం..అనిల్‌కు యాంటీగా ఉన్నారు. దీనికి తోడు తాజాగా అనిల్ బాబాయ్..నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ సైతం..అనిల్‌కు యాంటీగా మారారు. ఇదే క్రమంలో ఆయన నెల్లూరు సిటీ సీటు ట్రై చేస్తున్నారనే కథనాలు వస్తున్నాయి. మొత్తానికి అనిల్‌కు నెల్లూరులో ఎదురుదెబ్బలు తగిలేలా ఉన్నాయి.


Leave feedback about this