ఇటీవల టీడీపీ నేతలు ఎక్కడా తగ్గడం లేదు…తమదైన శైలిలో రాజకీయం చేస్తూ ముందుకెళుతున్నారు…అధికార వైసీపీకి టీడీపీ నేతలు భయపడే పరిస్తితి కనిపించడం లేదు..మొదట్లో అంటే కాస్త భయపడ్డారు గాని…తర్వాత నుంచి వైసీపీ ప్రభుత్వం ఎన్ని రకాలుగా మాటల దాడి చేసిన, కేసులు పెట్టి జైలుకు పంపించిన సరే టీడీపీ నేతలు ఏ మాత్రం భయపడటం లేదు. వైసీపీకి ధీటుగానే వారు కూడా మాట్లాడుతున్నారు…రాజకీయం చేస్తున్నారు…ఏదో వైసీపీ నేతలు అంటున్నారని చెప్పి సైలెంట్ గా మాత్రం కూర్చోవడం లేదు..ఎప్పటికప్పుడు వడ్డీతో సహ తిరిగి ఇచ్చేస్తున్నారు.

తమపై ఎవరైనా విమర్శలు చేస్తే చేతులు కట్టుకుని ఉన్ద్తామ్ లేదు…వెంటనే రివర్స్ లో కౌంటర్లు వేసేస్తున్నారు. ఇక టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత ఏ స్థాయిలో వైసీపీ ప్రభుత్వంపై పోరాడుతున్నారో తెలిసిందే..మొదట్లో మహిళా విభాగం పెద్దగా యాక్టివ్ గా లేదనే చెప్పాలి..కానీ ఎప్పుడైతే అనిత అధ్యక్షురాలు అయ్యారో అప్పటినుంచి సీన్ మారిపోయింది…అనిత అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలో మహిళా సమస్యలపై పోరాటం మొదలుపెట్టారు.

అలాగే మహిళలకు అందిస్తున్న సంక్షేమ పథకాల్లో ఉన్న లోపాలపై కూడా గళం విప్పుతున్నారు. ఇలా అన్నిరకాలుగా అనిత దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. అలాగే ప్రతి జిల్లాలో మహిళల కోసం ప్రత్యేక సభలు పెడుతూ…వారి సమస్యలని తెలుసుకుంటున్నారు. ఇక తాజాగా అనిత…నెల్లూరు జిల్లాలో ఒక సభ ఏర్పాటు చేశారు..అక్కడున్న సమస్యలపై మాట్లాడారు..అదేవిధంగా ప్రశ్నిస్తున్నా మహిళలపై పోలీసుల వ్యవహరిస్తున్న తీరుని సైతం ఖండించారు. ఇదే సమయంలో అనితపై కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

మామూలుగా విమర్శలు చేస్తే బాగానే ఉంటుంది గాని…వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడారు..ఇక దీని పై టీడీపీ నేతలు ఘాటుగానే స్పందిస్తున్నారు..అలాగే అనిత సైతం..ప్రసన్న కుమార్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఇంకోసారి తన గురించి అసభ్యంగా మాట్లాడితే ఇంటికెళ్లి తాట తీస్తామని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తర్వాత మిమ్మల్ని మహిళలే పరిగెత్తించి బడిత పూజ చేస్తారని ప్రసన్నకు వార్నింగ్ ఇచ్చారు. అంటే రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైన సరే అనిత ఏ మాత్రం వెనక్కి తగ్గదకుండా ఫైట్ చేస్తున్నారు.

Discussion about this post