అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో మొదట నుంచి టిడిపికి బలం ఉన్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ లో పలుమార్లు సత్తా చాటింది. 1984, 1996, 1999, 2004, 2014 ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ లో టిడిపి గెలిచింది. ఇక అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో 2014 ఎన్నికల్లో మంచి విజయాలు అందుకుంది. కానీ 2019 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. అనకాపల్లి ఎంపీ సీటుతో పాటు..మాడుగుల, నర్సీపట్నం, చోడవరం, అనకాపల్లి, ఎలమంచిలి, పాయకరావుపేట, పెందుర్తి సీట్లలో టిడిపి ఓడిపోయింది.
అన్నీ చోట్ల వైసీపీ గెలిచింది. అంటే జగన్ గాలిలో అన్నీ సీట్లు వైసీపీ స్వీప్ చేసింది. కానీ ఇప్పుడు అక్కడ పరిస్తితి మారిపోయింది..సీన్ రివర్స్ అయిపోయింది. టిడిపి బలపడుతూ వస్తుంది. అనూహ్యంగా టిడిపి పుంజుకుంది. వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత..టిడిపి నేతలు బలపడటంతో సీన్ మారింది. లేటెస్ట్ గా వచ్చిన సర్వేల్లో టిడిపి మంచి విజయం అందుకోవడం ఖాయమని తేలింది.

సర్వే ప్రకారం నర్సీపట్నం, పెందుర్తి, అనకాపల్లి సీట్లలో టిడిపి గెలుస్తుందని తేలింది. చోడవరం, మాడుగుల సీట్లు వైసీపీ గెలుచుకుంటుందని తెలిసింది. ఇక పాయకరావుపేట, ఎలమంచిలి సీట్లలో టఫ్ ఫైట్ ఉంటుందని తేలింది. అయితే అనకాపల్లి పార్లమెంట్ లో మొత్తం మీద టిడిపికి ఆధిక్యం ఉంది. అయితే ఇక్కడ టిడిపి ఇంకా సత్తా చాటాలంటే జనసేన సపోర్ట్ అవసరం అనే చెప్పాలి.
పాయకరావుపేట, ఎలమంచిలి, చోడవరం, అనకాపల్లి స్థానాల్లో జనసేనకు కాస్త ఓటు బ్యాంకు ఉంది. జనసేనతో పొత్తు ఉంటే దాదాపు 6 సీట్లు గెలుచుకోవచ్చు. ఒక్క మాడుగుల కాస్త కష్టం. అయితే దానిపై ఫోకస్ చేసి కష్టపడితే అది కూడా సొంతం చేసుకోవచ్చు. అంటే టిడిపి-జనసేన కలిస్తే అనకాపల్లిలో స్వీప్ చేయవచ్చు.
