అన్న వస్తున్నాడు….రైతులకు 9 గంటల ఉచిత కరెంట్ ఇస్తారని..అది కూడా పగటి పుట ఉచిత కరెంట్ ఇస్తారని 2019 ఎన్నికల ముందు జగన్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు…అధికారంలో వచ్చిన తర్వాత అమలయ్యే హామీలకు ఏ మాత్రం సంబంధం లేదనుకోండి…అందులో భాగమే పగటి పూట ఉచిత కరెంట్. యధావిధిగానే అన్నీ విషయాల్లో మాట తప్పి, మడమ తిప్పినట్లు…ఈ విషయంలో కూడా జగనన్న మాట తప్పారని రైతులు పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు.

ఇప్పటికే విద్యుత్ మీటర్ల పేరిట రైతుల దగ్గర నుంచి ముందే డబ్బులు వసూలు చేసి…ఆ డబ్బులనే మళ్ళీ తిరిగి ఇచ్చే విధంగా కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు పగటి పుట ఉచిత కరెంట్‌కు కూడా మంగళం పాడేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి విద్యుత్‌ను నిరంతరాయంగా 9 గంటలపాటు, పగటిపూట ఇస్తామని వైసీపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని, ఆ మేరకు జగన్ పగలు విద్యుత్ ఇస్తాడని ఆశించి నష్టపోయామని, ఇక్కడ తమకు మాత్రం రాత్రి వేళల్లోనే వ్యవసాయానికి విద్యుత్ అందిస్తున్నారని అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు ఆవేదన చెందుతూ మాట్లాడిన ఓ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

నిద్ర ఆపుకుని, పురుగుపుట్రకు భయపడుతూ…రాత్రి పూట పొలాలకు వెళ్లాల్సి వస్తుందని ఆ రైతు ఆవేదన చెందుతున్నారు. పగటిపూట కరెంట్ ఇస్తే కొంత ఊరట ఉంటుందని ఆ రైతు చెబుతున్నారు. ఇక ఈ ఉచిత కరెంట్ విషయాన్ని పక్కనబెడితే…జగనన్న పాలనలో కరెంట్ కోతలు కూడా మొదలయ్యాయని ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. గ్రామాల్లో రాత్రిపూట ఎక్కువ సమయం కరెంట్ కోతలు విధిస్తున్నారని, వేసవి రాక ముందే ఇలా కోతలు విధిస్తే వేసవిలో ఏం చేస్తారో అని ప్రశ్నిస్తున్నారు.

Discussion about this post