పశ్చిమ గోదావరి జిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అందుకే గత ఎన్నికల్లో చిత్తుగా ఓడినా సరే త్వరగానే జిల్లాలో పికప్ అయింది. అన్నీ నియోజకవర్గాల్లో కాకపోయిన…కొన్ని చోట్ల టీడీపీ త్వరగా పికప్ అయింది. ఈ రెండున్నర ఏళ్లలో ఊహించని విధంగా పలు నియోజకవర్గాల్లో టీడీపీ లీడ్‌లోకి వచ్చింది. ఇక ఆ నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపు ఖాయమే అని అర్ధమవుతుంది.

అలా టీడీపీ గెలిచే సీట్లలో తణుకు కూడా ఒకటి అని వెస్ట్ రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. తణుకు అంటేనే టీడీపీ కంచుకోట. గత ఎన్నికల్లో కూడా గెలిచేది…కానీ ఊహించని విధంగా టీడీపీ నేత అరిమిల్లి రాధాకృష్ణ…స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు. కేవలం 2 వేల ఓట్ల తేడాతో వైసీపీ తరుపున కారుమూరి నాగేశ్వరరావు విజయం సాధించారు.

అయితే రెండున్నర ఏళ్లలో ఎమ్మెల్యే నాగేశ్వరరావు గొప్ప పనితీరు ఏమి కనబర్చలేదని తెలుస్తోంది…ప్రభుత్వ పథకాలు తప్ప పెద్దగా చేసింది ఏమి లేదని అర్ధమవుతుంది. కానీ గతంలో ఎమ్మెల్యేగా అరిమిల్లి మాత్రం తణుకుని అభివృద్ధి బాట పట్టించారు. అటు ఎలాగో సంక్షేమం కూడా సమపాళ్లలో జరిగింది. అన్నీ రకాలుగా అరిమిల్లి బెస్ట్ అనిపించుకున్నారు. అందుకే 2019 ఎన్నికల్లో కూడా తణుకు ప్రజలు అరిమిల్లి వైపు బాగానే మొగ్గు చూపారు.

కానీ ఇక్కడ జనసేన ప్రభావం వల్ల దెబ్బపడింది. ఆ ఎన్నికల్లో జనసేనకు 31 వేల ఓట్లు పడ్డాయి. జనసేన ఆ ఓట్లు చీల్చేయడం వల్ల వైసీపీ గెలిచేసింది. అయితే ఈ సారి జనసేన విడిగా పోటీ చేసిన సరే ఇక్కడ అరిమిల్లికే ప్రజల మద్ధతు ఎక్కువగా ఉన్నట్లు కనబడుతోంది. ఒకవేళ జనసేన గానీ టీడీపీతో కలిస్తే ఇక్కడ అరిమిల్లి గెలుపుని ఆపడం అసాధ్యమనే చెప్పాలి. ఏదేమైనా తణుకులో ఈ సారి టీడీపీ జెండానే ఎగిరేలా ఉంది.


Discussion about this post