వైసీపీకి అధికార దాహం తీరడం లేదా? ప్రతిచోటా తామే అధికారంలో ఉండాలని అనుకుంటున్నారా? ఎలాగైనా సరే గెలవాలనే వైసీపీ పనిచేస్తుందా? అంటే గత స్థానిక ఎన్నికలని చూస్తే అది నిజమే అని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. ఒకే ఒక మాట..జగన్ చెప్పింది…మొత్తం రాజకీయాన్ని మార్చేసింది. ఎమ్మెల్యేలు, మంత్రులు….తమ తమ నియోజకవర్గాల్లో 90 శాతం పైనే ఫలితాలు సాధించాలని టార్గెట్ పెట్టారు.

ఇక అంతే అక్కడ నుంచి వైసీపీ గెలవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందో చెప్పాల్సిన పని లేదు. ప్రజల మద్ధతు గెలవాలనే విషయాన్ని మర్చిపోయి, అరాచకాలతో గెలవడానికి చూస్తున్నారని టీడీపీ నేతలు, కార్యకర్తలు ముందు నుంచి గగ్గోలు పెడుతూనే ఉన్నారు. అప్పుడు పంచాయితీ, ఎంపిటిసి, జెడ్‌పిటిసి, మున్సిపాలిటీలని ఎలా గెలుచుకున్నారో అందరికీ తెలుసని, ఇప్పుడు కొన్ని స్థానాలకు జరిగే ఎన్నికల్లో అదే సీన్ రిపీట్ చేస్తున్నారని తమ్ముళ్ళు అంటున్నారు.

ముఖ్యంగా కుప్పం మున్సిపాలిటీని గెలుచుకోవడానికి వైసీపీ చేయని ప్రయత్నాలు లేవని అంటున్నారు. ఇక గతంలో పుంగనూరు మున్సిపాలిటీలో టీడీపీ అభ్యర్ధుల నామినేషన్లని చించివేసి, వైసీపీ అభ్యర్ధుల ఏకగ్రీవానికి సహకరించారనే ఆరోపణలు ఎదురుకుంటున్న లోకేష్ వర్మ అనే ఎన్నికల అధికారిని మళ్ళీ కుప్పంలో అధికారిగా నియమించుకున్నారని, అంటే కుప్పంలో కూడా అక్రమంగా గెలవడానికి ప్లాన్ చేశారని స్వయంగా చంద్రబాబే చెబుతున్నారు.

అలాగే పలు చోట్ల టీడీపీ అభ్యర్ధులని నామినేషన్స్ వేయనివ్వకుండా బెదిరించడం…నామినేషన్ల పత్రాలు చించివేయడం చేశారు. ఇక ఇన్ని జరుగుతున్న పోలీసులు ఏమి చేయలేని పరిస్తితులో ఉన్నారు. అంటే ఎక్కడైనా తామే గెలవాలనే అధికార దాహంతో వైసీపీ ఉందని, అందుకే ఇలా అనేక రకాలుగా అరాచకాలు చేసి గెలుస్తున్నారని చెబుతున్నారు. అయితే ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, టైమ్ వచ్చినప్పుడు…అదే జనం వైసీపీకి సినిమా చూపిస్తుందని అంటున్నారు. ఇప్పుడు తాత్కాలికంగా విజయం సాధించి హడావిడి చేసిన..అసలు ఎన్నికల్లో చుక్కలు చూపిస్తారని అంటున్నారు.

Discussion about this post