తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టిడిపి భారీ మెజారిటీతో గెలవడంలో లోకేష్ పాత్ర కూడా ఉందా? ఆయన పాదయాత్ర వల్ల చిత్తూరులో ప్లస్ అయిందా? అంటే అయిందనే చెప్పవచ్చు. తూర్పు రాయలసీమ స్థానం పరిధిలో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూడు జిల్లాలని కలిపి తూర్పు రాయలసీమ స్థానం అంటారు..ఈ స్థానంలో టిడిపి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.
టిడిపి నుంచి కంచర్ల శ్రీకాంత్ దాదాపు 34 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. మూడు జిల్లాల్లో టిడిపి ఆధిక్యం నడిచింది. అయితే లేటెస్ట్ సర్వేల్లో ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో టిడిపి బలపడిందని తెలిసింది గాని..చిత్తూరులో బలపడలేదని సర్వే వచ్చింది. ఆత్మసాక్షి సర్వేలో చిత్తూరులో 14 సీట్లు ఉంటే వైసీపీ 8, టిడిపి 4 సీట్లు గెలుచుకుంటుందని తేలింది. 2 సీట్లలో టఫ్ ఫైట్ ఉంది. అంటే ఇక్కడ వైసీపీకే లీడ్ ఉంది. అలాంటప్పుడు పట్టభద్రుల స్థానంలో కూడా చిత్తూరులో వైసీపీకి లీడ్ రావాలి. కానీ అనూహ్యంగా టిడిపికి లీడ్ వచ్చింది.

టిడిపికి లీడ్ రావడానికి లోకేష్ పాదయాత్ర ప్రధాన కారణమని తమ్ముళ్ళు అంటున్నారు. ఎందుకంటే జిల్లాలోని 14 స్థానాల్లో లోకేష్ పాదయాత్ర సాగింది. ఈయన పాదయాత్రలో పెద్ద ఎత్తున యువతని కలుసుకున్నారు. యువత సమస్యలు తెలుసుకున్నారు..నిరుద్యోగ సమస్యని తాము అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే టిడిపి హయంలో చిత్తూరులో తీసుకొచ్చిన కంపెనీల ముందు లోకేష్ సెల్ఫీ తీసుకుని పెడుతూ వచ్చారు.
ఎక్కడకక్కడ యువతతో ఇంటరాక్ట్ అవుతూ వచ్చారు..ఫలితంగా యువత మద్ధతు పెరిగింది..ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాగా ప్రభావితం చూపిందనే చెప్పాలి. చిత్తూరులో టిడిపికి లీడ్ రావడానికి లోకేష్ పాదయాత్ర మొదట కారణమని చెప్పవచ్చు. ఇక లోకేష్ చిత్తూరులో పాదయాత్ర ముగించుకుని అనంతపురంలోకి ఎంట్రీ ఇచ్చారు.
