ఇటీవల ఏపీ అసెంబ్లీలో జరిగిన సంఘటనలు సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అసెంబ్లీలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు…టీడీపీ అధినేత చంద్రబాబుని టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అలాగే ఆయన సతీమణి భువనేశ్వరిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చేశారు. దీనిపై చంద్రబాబు తీవ్రంగా స్పందించి…మళ్ళీ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తానని శపథం చేసి, అసెంబ్లీని బాయ్‌కాట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే తన సతీమణిని ఉద్దేశించి మాట్లాడటంపై చంద్రబాబు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. బోరున కన్నీరు పెట్టుకున్నారు.

దీంతో అందరూ వైసీపీ నేతల వైఖరిని తప్పుబట్టే పరిస్తితి వచ్చింది. నందమూరి ఫ్యామిలీ సైతం చంద్రబాబుకు మద్ధతు తెలుపుతూ…వైసీపీ నేతలపై ఫైర్ అయింది. ఇక రాజకీయాలకు అతీతంగా మిగిలిన నేతలు సైతం బాబుకు మద్ధతు తెలుపుతున్నారు. అయితే వైసీపీ మంత్రులు..భువనేశ్వరిని ఒక్క మాట కూడా అనలేదని, చంద్రబాబు కావాలని డ్రామాలు ఆడుతున్నారని అంటున్నారు. కానీ అసెంబ్లీలో గానీ, బయట ఒక ఎమ్మెల్యే పరోక్షంగా భువనేశ్వరి గురించి ఏం మాట్లాడారో జనాలు చూశారు.

అయితే అసెంబ్లీలో ఆరోజు ఏం జరిగిందో…దానికి సంబంధించిన ఆడియో, వీడియోలని ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేశారు. భువనేశ్వరిపై పాలకపక్ష సభ్యులు చేసిన నిందారోపణలు మహిళల మనోభావాలను తీవ్రంగా కించపర్చినట్లైయిందని, కానీ ప్రభుత్వం మాత్రం భువనేశ్వరి పట్ల ఎటువంటి వివాదస్పద వ్యాఖ్యలు చేయలేదని బుకాయిస్తోందని, అందుకే ఆరోజు రికార్డు అయిన ఆడియో, వీడియోలను ఎడిటింగ్ లేకుండా ప్రజల ముందుంచాలని అనగాని కోరారు.

అయితే టీడీపీ కోరినట్లు ఎలాంటి ఎడిటింగ్‌లు లేకుండా ఆడియో, వీడియోలు వస్తాయనే గ్యారెంటీ లేదనే చెప్పాలి. అసలు అసెంబ్లీ ఫుటేజ్ ఇస్తారా? లేదా? అనేది కూడా డౌట్ అనే చెప్పాలి. మరి ఈ అంశంపై టీడీపీ ఏవిధంగా ముందుకెళుతుందో చూడాలి.

Discussion about this post