టీడీపీ అధినేత చంద్రబాబలేని లోటు తీరుతోందా? ఆయన చేసిన శపథం మేరకు.. ప్రస్తుతం జరుగుతున్న బడ్జట్ సమావేశాలకు చంద్రబాబు హాజరు కావడం లేదు. అయితే.. బడ్జెట్ సమావేశాల్లో చంద్రబాబు వంటి కీలక నేత లేకపోతే.. టీడీపీ ఇబ్బందుల్లో పడడం ఖాయమని.. అందరూ అనుకున్నారు. ఎందుకంటే.. అధి కార పక్షానికి సరైన కౌంటర్ ఇవ్వాలన్నా.. అధికార పార్టీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలన్నా.. చంద్రబాబు సభలో ఉండాల్సిందేననే ఒక టాక్ ఉంది. ఆయన సభలో ఉంటేనే నైతికంగా టీడీపీ నేతలకు బలం ఉంటుందని అందరికీ తెలిసిందే.

అయితే.. ఇప్పటి వరకు సభా సమయం ఎలా గడిచినా..ఇప్పుడు సభలో టీడీపీ కీలకంగా మారింది. అంతేకా దు.. రెండున్నరేళ్ల పాలన తర్వాత.. అధికారపార్టీకి చుక్కలు చూపించాలంటే.. ఖచ్చితంగా ప్రస్తుతం జరు గుతున్న సభలను టీడీపీ సరిగా వాడుకోవాలనే..సూచనలు వున్నాయి. ఇలాంటి కీలక సమయంలో సభకు చంద్రబాబు హాజరు కావడం అత్యంత అవసరం. అయితే.. ఆయన శపథం చేసిన మేరకు.. సభకు దూరంగా ఉన్నారు. దీంతో టీడీపీ సభలో పేలవంగా మారిపోతుందని.. కొందరు అంచనా వేసుకున్నారు.

అయితే.. అనూహ్యంగా బడ్జెట్ సమావేశాల తొలిరోజే.. సభలో టీడీపీ సభ్యులు భారీ ఎత్తున పుంజుకున్నారు. తొలిరోజు సభలోనే.. టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు సారధ్యంలో తమ సత్తా చాటుకున్నారు. ఆదిలోనే దూకుడు ప్రదర్శించడం ద్వారా.. అధికార పార్టీపై పైచేయి సాధించేందుకు ప్రయత్నించారు. గవర్నర్ ప్రసంగాన్ని ప్రారంభించగానే.టీడీపీ సభ్యులు తమదైన స్టయిల్‌లో నిరసన వ్యక్తం చేశారు. ఈ పరిణామాన్ని వైసీపీ అస్సలు ఊహించలేదు. అంతేకాదు.. హఠాత్పరిణామంతో ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా చూస్తే.. బాబు లేనిలోటు టీడీపీ నాయకులు తీరుస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.
Discussion about this post