రాష్ట్రంలో మహిళా ఓటు బ్యాంకు ఏ రాజకీయ పార్టీకైనా అత్యంత కీలకం. ఎవరు ఎటు ఉన్నా.. ఏ పార్టీది ఏ అజెండా అయినా.. మహిళలకు మాత్రం ప్రతి పార్టీ ప్రాధాన్యం ఇస్తున్నాయి. గత ఎన్నికలకు ముందు.. మహిళా ఓటు బ్యాంకునుత నవైపు తిప్పుకొనేందుకు .. అప్పటి అధికార పార్టీ చంద్రబాబు.. పసుపు-కుం కుమ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే.. ఇంతకన్నా ఎక్కువగా .. తమకు జగన్ ఏమైనా చేస్తాడని.. భావించిన రాష్ట్రంలోని మహిళా ఓటర్లు.. జగన్ వైపు నిలబడ్డారు. దీంతో జగన్ భారీ మెజారిటీతో విజయం దక్కించుకున్నారు.

ఈ క్రమంలోనే తన మంత్రివర్గంలో.. మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారు జగన్. ఏకంగా.. బడుగు, బలహీన వర్గాలకు చెందిన మహిళలకు ఆయన మంత్రి పదవులు ఇచ్చారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, వారి కి అధికారాలు ఇవ్వలేదని.. కేవలం పేరుకే మంత్రులుగా ఉన్నారనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోం ది. ఇప్పటివరకు చూసుకుంటే.. ఏ మహిళా మంత్రి కూడా రికార్డు స్థాయిలో తీసుకున్న సంచలనం నిర్ణ యం అంటూ.. ఏదీ లేదు. అంతేకాదు.. ఎవరికీ స్వేచ్ఛ లేదనే వాదన కూడా వినిపిస్తోంది. ఇది ప్రజల్లోకి జోరుగా వెళ్తోంది. మరీ ముఖ్యంగా మహిళల్లోనూ చర్చకు దారితీస్తోంది.

మరోవైపు.. అగ్రవర్ణ మహిళలకు జగన్ ప్రాధాన్యం ఇవ్వకపోవడం కూడా ప్రధానంగా ప్రస్తావనకు వస్తున్న విషయం. రెడ్డి సామాజిక వర్గానికి కానీ.. ఇతర సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని.. చాలా మంది భావిస్తున్నారు. ఈ పరిణామమే.. జగన్‌కు ఇబ్బందిగా మారింది. మరోవైపు.. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ దూకుడుగా ముందుకు సాగుతోంది. ఎక్కువ మంది మహిళలకు పార్టీలో పదవులు ఇవ్వడంతోపాటు.. గత ప్రభుత్వంలో ఒక ఎస్సీ, ఒక ఓసీ సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు చంద్రబాబు తన కేబినెట్‌లో అవకాశం కల్పించారు.

ఇక, ఇప్పుడు తెలుగు మహిళ.. విభాగంలోనూ భారీ సంఖ్యలో పదవులు కల్పించారు. ఇది ఆ పార్టీకి మేలు చేస్తుందని అంటున్నారు. ఎందుకంటే.. తెలుగు మహిళ విభాగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కువ మందికి అవకాశం కల్పించారు. ఇది .. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే కాకుండా.. మహిళలను పార్టీవైపు మళ్లించేందుకు ఉపయోగపడుతుందని.. భావిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి.. టీడీపీ వైపు మహిళలు దృష్టి సారించడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Discussion about this post