ఏపీలో ప్రకాశం జిల్లాకు చెందిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తో పాటు ఆయన భార్యకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఈ దంపతులు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సుప్రీం సీబీఐ దర్యాప్తునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సుప్రీం గ్రీన్ సిగ్నల్ తో సురేష్ దంపతులు సీబీఐ విచారణ ఎదుర్కోక తప్పని పరిస్థితి.

ఇక సురేష్ మాజీ ఐఆర్ ఎస్ అధికారి… అంతే కాకుండా ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత సన్నిహితుడు. ఉన్నత విద్య చదవడంతో పాటు కేంద్ర సర్వీసుల్లో పనిచేసిన అధికారి కావడంతో జగన్ ఆయనకు విద్యాశాఖ కట్టబెట్టారు. ఇక సురేష్ భార్య విజయలక్ష్మి కూడా ఐఆర్ఎస్ అధికారిణి. వీరిపై ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని సీబీఐ 2016లో కేసు నమోదు చేయడంతో పాటు 2017లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది.అయితే ఈ ఎఫ్ఐఆర్ పై సురేష్ దంపతులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. అప్పుడు సీఐబీ ఆరోపణలనే హైకోర్టు తోసిపుచ్చడంతో పాటు ఆ అఫిడవిట్‌లో లోపాలు ఉన్నాయని కూడా చెప్పింది. దీంతో ఇప్పుడు సుప్రీం జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తుది తీర్పు ఇవ్వడంతో పాటు హైకోర్టు చెప్పినట్టు ప్రాథమిక విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

దీంతో వెంటనే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి విచారణ చేసేందుకు సీబీఐకి అనుమతించింది. దీంతో జగన్ కేబినెట్‌లో మంత్రి సీబీఐ విచారణ ఎదుర్కోవాల్సి రావడంతో ఇప్పుడు ప్రభుత్వం ఇరకాటంలో పడినట్లయ్యింది. ఇక ఆయన మంత్రి పదవి కూడా త్వరలోనే ఊస్ట్ అవుతుందని కూడా వైసీపీలో చర్చ జరుగుతోంది.
Discussion about this post