ఏపీ రాజకీయాల్లో ఆత్మసాక్షి సంస్థ సర్వే సంచలనం సృష్టిస్తుంది. తాజాగా రిలీజ్ చేసిన ఆత్మసాక్షి సర్వే…ఊహించని విధంగా ఫలితాలు వచ్చాయి. మళ్ళీ ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలిచేస్తామని హల్చల్ చేస్తున్న వైసీపీకి భారీ షాక్ ఇచ్చినట్లు అయింది. 175 సీట్లే టార్గెట్ అని కాన్ఫిడెన్స్ తో ఉన్న జగన్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఈ సారి ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం కష్టమని తేలిపోయింది. కొద్దిగా కష్టపడితే టిడిపి అధికారంలోకి వస్తుందని ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేసింది.
ఎలాంటి పొత్తు లేకుండా ఆత్మసాక్షి ఇచ్చిన సర్వే వివరాలు ఇలా ఉన్నాయి. ఎవరికి వారు సింగిల్ గా పోటీ చేస్తే 175 సీట్లలో టిడిపికి 78, వైసీపీకి 63, జనసేనకు 7 సీట్లు వస్తాయని ఆత్మసాక్షి సర్వే అంచనా వేసింది. ఇక 27 స్థానాల్లో వైసీపీ-టిడిపిల మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని…అందులో కూడా 13 స్థానాల్లో టిడిపికి, 14 స్థానాల్లో వైసీపీకి ఎడ్జ్ ఉందని సర్వే తేల్చి చెప్పింది.

అంటే 175 స్థానాలకు అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 88..టిడిపికి మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశాలు ఉన్నాయి. అయితే పొత్తు లేకపోవడం వల్ల చాలా స్థానాల్లో జనసేన ఓట్ల చీలిక టిడిపికి కాస్త ఇబ్బందిగా మారిందని తెలుస్తోంది. అయినా సరే సింగిల్ గా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తేల్చి చెప్పింది.
జిల్లాల వారీగా చూస్తే…శ్రీకాకుళం(10): టిడిపి-6, వైసీపీ-2, టఫ్ ఫైట్-2.. విజయనగరం(9): టిడిపి-4, వైసీపీ-3, టఫ్ ఫైట్-2.. విశాఖ(15): టిడిపి-7, వైసీపీ-5, టఫ్ ఫైట్-3.. తూర్పు గోదావరి(19): టిడిపి-6, వైసీపీ-6, జనసేన-4, టఫ్ ఫైట్-3.. పశ్చిమ గోదావరి(15): టిడిపి-8, వైసీపీ-2, జనసేన-3, టఫ్ ఫైట్-2.. కృష్ణా(16): టిడిపి-8, వైసీపీ-5, టఫ్ ఫైట్-3.. గుంటూరు(17): టిడిపి-8, వైసీపీ-6, టఫ్ ఫైట్-3.. ప్రకాశం(12) టిడిపి- 6, వైసీపీ-5, టఫ్ ఫైట్-1.. నెల్లూరు(10): టిడిపి-5, వైసీపీ-2, టఫ్ ఫైట్-3.. ఛిత్తూరు(14): టిడిపి-4, వైసీపీ-8, టఫ్ ఫైట్-2.. అనంత(14): టిడిపి-7, వైసీపీ-7, టఫ్ ఫైట్-1, కడప(10): టిడిపి- 2, వైసీపీ-6, టఫ్ ఫైట్-2..కర్నూలు(14): టిడిపి-7, వైసీపీ-7 సీట్లు గెలుచుకుంటుందని ఆత్మసాక్షి సర్వే అంచనా వేసింది.