ఏపీలో వారసత్వ రాజకీయాలకు పెద్ద పీఠ వేస్తారనే విషయం తెలిసిందే. ఇక్కడ ప్రతి నేత వారసుడు…రాజకీయాల్లోకి రావాలనే చూస్తారు. అలాగే నాయకులు కూడా తమ వారసులని రాజకీయాల్లోకి తీసుకొచ్చి సక్సెస్ చేయాలని చూస్తారు. ఇప్పటికే ఏపీలో చాలామంది వారసులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. అయితే ఇంకా కొంతమంది వారసులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.

ఈ క్రమంలోనే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు నెక్స్ట్ ఎన్నికల బరిలో దిగనున్నారు. పెద్దిరెడ్డి సోదరుడు కుమారుడు సుధీర్ రెడ్డి..ఇప్పటికే యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వచ్చేశారు. పెద్దిరెడ్డి రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో బిజీగా ఉండటంతో…సుధీర్, పుంగనూరు నియోజకవర్గంలో పనులు చేస్తున్నారు. ఇలా పుంగనూరులో వైసీపీ బలోపేతానికి కృషి చేస్తున్న సుధీర్…నెక్స్ట్ ఎన్నికల బరిలో నిలబడటం ఖాయమని ప్రచారం జరుగుతుంది.

ఇప్పటికే పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుంచి….ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి, తంబళ్ళపల్లె ఎమ్మెల్యేగా ఉన్నారు. అటు కుమారుడు మిథున్ రెడ్డి, రాజంపేట ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు సుధీర్ రెడ్డి సైతం బరిలో దిగబోతున్నారు. అయితే సుధీర్ రెడ్డిని…చంద్రబాబు కంచుకోట కుప్పం బరిలో దింపాలని చూస్తున్నట్లు చిత్తూరు జిల్లాలో టాక్. గత కొన్ని ఎన్నికలుగా అక్కడ…చంద్రమౌళి, చంద్రబాబుపై పోటీ చేసి ఓడిపోతున్న విషయం తెలిసిందే. ఇక ఆయన మరణించడంతో కుప్పం బాధ్యతలు చందమౌళి కుమారుడు భరత్‌కు బాధ్యతలు అప్పగించారు.

ఇటీవల భరత్‌కు ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు. దీంతో నెక్స్ట్ ఆయనకు సీటు వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. పెద్దిరెడ్డి ఫ్యామిలీ వారసుడు అయితేనే కుప్పంలో బాబుకు చెక్ పెట్టగలరని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఒకవేళ జగన్ మాత్రం భరత్‌కే సీటు ఇవ్వాలని ఫిక్స్ అయితే…సుధీర్ రెడ్డిని వేరే నియోజకవర్గాలకు పంపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పీలేరు లేదా పలమనేరు బరిలో నిలబెట్టోచ్చని ప్రచారం వస్తుంది. చూడాలి మరి పెద్దిరెడ్డి ఫ్యామిలీ వారసుడు ఏ సీటులో పోటీ చేస్తారో..?

Discussion about this post