రాష్ట్రంలో కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. అయితే.. ఇప్పటికే ఉభయగోదావురులు సహా.. అనంత పురం, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోటీడీపీ హవా అందరికీ తెలిసిందే. అయితే.. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసే బాపట్ల జిల్లాలోనూ.. టీడీపీ హవా కొనసాగుతుందనే అంచనాలు వస్తున్నాయి. అంతేకాదు.. వచ్చేఎన్ని కల్లో ఈ జిల్లా మొత్తంగా టీడీపీ ఖాతాలోకి జమ అవుతుందని చెబుతున్నారు పరిశీలకులు. మరి దీనికి కారణాలు ఏంటి? టీడీపీకి ఎలా సాధ్యం అనే విషయాలు ఆసక్తిగా మారాయి.

గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని వేమూరు, రేపల్లె, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల, ఒంగోలు, సంతనూతల పాడు నియోజకవర్గాలను కలుపుతూ.. బాపట్ల కేంద్రంగా బాపట్ల జిల్లాను ( సంతనూతలపాడు బాపట్ల పార్లమెంటు అయినా ఒంగోలులో చేర్చారు) ఏర్పాటు చేస్తున్నారు. ఈ పరిణామం.. అధికార వైసీపీకంటే కూడా ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి గట్టిగా కలిసి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి కారణం.. ఇక్కడ కీలకమైన నియోజకవర్గాల్లో టీడీపీ బలంగా ఉండడమే. పైగా.. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం ఇంచార్జ్‌గా ఉన్న పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు.. ఇక్కడ గట్టిగా కష్టపడుతున్నారు.

పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా..ఏలూరి అడుగులు వేస్తున్నారు. ప్రజల్లో మమేకం అవుతున్నారు. పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నారు. అందరినీ కలుపుకొని పోతున్నారు. దీంతో ఆయన దూకుడు కారణంగా.. బాపట్ల పార్లమెంటు పరిధిలో టీడీపీ దూకుడు మామూలుగా లేదుగా! అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక, కొత్తగా ఏర్పడే జిల్లాలోకి కలిసే.. అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితిని చూస్తే.. టీడీపీ గెలుపు ఖాయమనే అంటున్నారు పరిశీలకులు.

వేమూరు: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు.. వరుసగా 2009, 2014లోనూ విజయం దక్కింకున్న ఎస్సీ నియోజకవర్గం. ప్రస్తుతం ఉన్న వైసీపీ నాయకుడు మేరుగ నాగార్జున ఇక్కడ ఏమీ చేయడం లేదని.. కనీసం.. చిన్నపాటి అభివృద్ధి పని కూడా చేపట్టడం లేదని.. ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ఇక నాగార్జునపై ఇప్పటికే తీవ్రమైన అవినీతి ఆరోపణలు కూడా వచ్చేశాయి. దీనికితోడు నక్కా దూకుడుగా ఉన్నారు. పార్టీ తరఫున, ప్రజల తరఫున.. వాయిస్ వినిపిస్తున్నారు. దీంతో ఆయన గెలుపు ఖాయమనే అంచనాలు వస్తున్నాయి.

రేపల్లెలో.. టీడీపీ వరుస విజయాలు సాధించింది. గత ఎన్నికల్లో వైసీపీ సునామీ తట్టుకుని మరీ.. అనగాని సత్యప్రసాద్ విజయం దక్కించుకున్నారు. వైసీపీకి ఇక్కడ అసలు కేండెట్ కూడా లేరు. ఉన్న మోపిదేవి వెంకటరమణకు రాజ్యసభకు పంపేశారు. సో.. మళ్లీ విజయం అనగానిదే..! గత ఎన్నికల్లో జగన్ సునామీలోనే ఘనవిజయం సాధించిన అనగానికి రేపల్లెలో హ్యాట్రిక్ విషయంలో ఎలాంటి డౌట్లు అక్కర్లేదని జిల్లా వైసీపీ వాళ్లే చెపుతున్నారు.

ఇక, బాపట్లలో కొత్త నేత.. వేగేశ్న నరేంద్రవర్మ.. దూకుడు కూడా జోరుగా ఉంది. బాపట్లలో వర్మ నాయకత్వానికి పార్టీలు, కులాలు, వర్గాలతో సంబంధం లేకుండా అందరికి సపోర్ట్ చేస్తున్నారు. ఏ పార్టీ అయినా కూడా ఆయన సేవలు పొందిన వాళ్లే నియోజకవర్గంలో ఎక్కువుగా ఉన్నారు. 20 ఏళ్ల తర్వాత బాపట్ల గడ్డపై వర్మ పసుపు జెండా ఎగరేసేందుకు రెడీగా ఉన్నారు.

పర్చూరు, అద్దంకి: ఈ రెండు కూడా టీడీపీ ఖాతాలోకే వెళ్తాయి. పరుచూరులో ఏలూరి సాంబశివరావుకు తిరుగులేదు. ఇక, అద్దంకిలో గొట్టిపాటి రవికి పోటీ ఇచ్చే నాయకుడు కూడా వైసీపీలో కనిపించడం లేదు. సో.. వీరి గెలుపును రాసిపెట్టుకోవచ్చనే వాదన వినిపిస్తోంది.

చీరాలలో.. వైసీపీ ఆమంచి కృష్ణమోహన్‌కు ఇస్తే.. టీడీపీ ఎవరికి టికెట్ ఇస్తుందనే వాదన ఉంది. ఆమంచికి ఇస్తే.. కొంత వరకు గట్టిపోటీ ఉంటుది. అలా కాకుండా.. టీడీపీ నుంచి వచ్చిన కరణం బలరాంకే ఇస్తే.. ఇక్కడీ టీడీపీ గెలుపు ఖాయం. మరోవైపు బాపట్ల పార్లమెంటులోనే ఉన్నా ఒంగోలు జిల్లాలో కలిసిన సంతనూతలపాడులో నాన్ లోకల్ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబుపై నియోజకవర్గ ప్రజలు, వైసీపీ కేడర్ రగిలిపోతోంది. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఆ సీటు బంపర్ మెజార్టీతో వైసీపీ ఖాతాలో పడుతుందని అంటున్నారు. ఓవరాల్‌గా బాపట్ల కొత్త జిల్లాలో టీడీపీకి తిరుగులేని ఆధిక్యత స్పష్టంగా కనిపిస్తోంది.

Discussion about this post