సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్నచంద్రబాబు అనుభవం ఎలా కలిసి వచ్చింది? గత ఎన్నికల తర్వాత.. ఇక పార్టీ ఉండదని… ఆయన కూడా తెరమరుగు కావాల్సిందేనని.. పదే పదే చెబుతూ.. వచ్చిన వైసీపీ నేతలకు షాకిచ్చేలా.. చంద్రబాబు తన వ్యూహాలను ఎలా పదును పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆయన తన అనుభవాన్ని ఎలా రంగరించారు? అనేది ఆసక్తికర విషయం. నిజానికి 2019 ఎన్నికల తర్వాత.. అందరూ ఇక, టీడీపీ పని అయిపోయిందనిఅనుకున్నారు.. చంద్రబాబువయసు రీత్యా ఇక, బయటకు వచ్చే అవకాశం లేదని అనుకున్నారు.

ఇక, వైసీపీ కూడా ఇక, చంద్రబాబు పని అయిపోయిందని, నందమూరి కుటుంబం నుంచి నాయకుడు వస్తే తప్ప.. పార్టీ బతికి బట్టకట్టే పరిస్థితి కూడా లేదని చెప్పుకొన్నారు. కానీ, వాస్తవానికి అందరూ ఇలా అనుకున్నా… చంద్రబాబు ఈ సమయంలోనే గట్టిగా నిలబడ్డారు. కానీ, ఒక రకంగా పరిస్థితిని గమనిస్తే.. 2020=21 మధ్య పార్టీ భారీ ఎదురు దెబ్బలు చవి చూసింది. గత ఎన్నికల్లో విజయం కదక్కించుకుని.. బాబుకు అత్యంత విశ్వాసపాత్రులుగా ఉన్నవారు.. ఓడిపోయినా.. బాబుకు అంతే విశ్వాసంతో ఉన్నవారు కూడా.. పార్టీ మారిపోయారు.’

కరణం బలరాం, వల్లభనేని వంశీ, శిద్ధారాఘవరావు తదితరులు పార్ట నుంచి బయటకు రావడం, గంటా శ్రీనివాసరావు పార్టీకి దూరంగా ఉండడం.. వంటివి పార్టీకి ఇబ్బందిగా మారాయి. అంతేకాదు… అచ్చెన్న్నా యుడు సహా అనేక మంది అరెస్టు కావడం.. వంటివి పార్టీని డిఫెన్స్‌లో పడేశాయి. ఈ పరిణామాలను బాబు ఇక ఎదుర్కొనే పరిస్థితి ఉండదని.. పార్టీ పరిస్థితి అయిపోయిందని అనుకున్నారు.

కానీ, ఆయన అనూ హ్యంగా తనే స్వయంగా రంగంలోకి దిగారు. పార్టీని గాడిలో పెట్టేందుకు అనేక అవమానాలుఎదురైనా భరించారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పార్టీలోని ప్రతి ఒక్కరితోనూ,.. నిత్యం మీటింగులు పెట్టరు. వారిలో ధైర్యం నింపారు. అసెంబ్లీలో గట్టిగా.. పోరాటం చేశారు.కేసులకు భయపడేదిలేదని తెగేసి చెప్పారు. ముఖ్యంగా అమరావతి విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేశారు. ఇది.. పార్టీని మళ్లీ నిలబెట్టింది. యువ నేతలను సమీకరించారు. వారికి వెనువెంటనే పదవులు ఇచ్చారు.

తెలుగు మహిళ విభాగాన్ని సంస్కరించారు. నిధులు సమకూర్చారు. ఇలా.. అన్ని విధాలా.. అన్ని వైపుల నుంచి మరోసారి.. తన దైన శైలిలో పార్టీని పుంజుకునేలా చేసి.. వచ్చే ఎన్నికల్లో పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందనే భరోసాను నింపే ప్రయత్నంలో బాబు సక్సెస్ అయ్యారు. దీంతో ఇప్పుడుమరోసారి.. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు గాలి వీచే అవకాశం ఉందనిఅంటున్నారు.

Discussion about this post