సాధారణంగా మంత్రులుగా పనిచేసేవారు..మళ్ళీ ఎన్నికల్లో గెలవడం తక్కువనే చెప్పాలి. ఏదో కొంతమంది తప్ప…మిగిలిన మంత్రులు విజయాలు అందుకోవడం జరగదు. ఏపీ రాజకీయాల్లో ఇది ఎప్పటినుంచో జరుగుతూ వస్తుంది. అదేంటో గానీ మంత్రులుగా పనిచేసే వారు మాత్రం ఎక్కువ గెలవరు. అంటే వారిపై ఎక్కువ వ్యతిరేకత పెరగడం వల్ల అలా జరుగుతుందని అనుకోవచ్చు. గతంలో టీడీపీ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారు…మళ్ళీ మంత్రులుగా గెలవలేదు. గంటా శ్రీనివాసరావు, అచ్చెన్న, చినరాజప్పలు తప్ప మిగిలిన వారు ఎవరు గెలవలేదు.

మరి ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల్లో కూడా కొంతమంది మళ్ళీ గెలవడం కష్టమని ఇప్పటికే సర్వేలు వస్తున్నాయి. ఈ రెండున్నర ఏళ్లలోనే పలువురు మంత్రులపై వ్యతిరేకత పెరిగినట్లు సర్వేలు వస్తున్నాయి. అలాగే మంత్రులకు ప్రత్యర్ధులుగా ఉన్న వారు పుంజుకున్నారని తెలుస్తోంది. అటు టీడీపీ-జనసేన కలుస్తున్న అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే పలువురు మంత్రులు డేంజర్ జోన్‌లోకి వెళ్ళినట్లే అని ఇటీవల సోషల్ మీడియలో ఓ సర్వే వైరల్ అవుతుంది.

ఆ మంత్రులు మళ్ళీ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఒకసారి ఆ మంత్రుల లిస్ట్‌ని చూస్తే..పలాసలో సీదిరి అప్పలరాజు, కురుపాంలో పుష్పశ్రీ, భీమిలిలో అవంతి శ్రీనివాస్, కాకినాడ రూరల్‌లో కన్నబాబు, అమలాపురంలో విశ్వరూప్, ఏలూరులో ఆళ్ళ నాని, కొవ్వూరులో వనిత, ఆచంటలో రంగనాథరాజు, బందరులో పేర్ని నాని, విజయవాడ వెస్ట్‌లో వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రత్తిపాడులో సుచరిత, నెల్లూరు సిటీలో అనిల్, జీడీ నెల్లూరులో నారాయణస్వామి, ఆలూరులో జయరాంలు డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక వీరికి అపోజిట్‌లో ఉన్న టీడీపీ నేతలు కూడా చాలావరకు పుంజుకున్నారని తెలుస్తోంది. అయితే వీరిలో టీడీపీ-జనసేన కాంబినేషన్‌తో ఎక్కువ మంది నష్టపోయే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఆ రెండు పార్టీలు కలిస్తే దాదాపు సగం మంది మంత్రులు ఓడిపోవడం గ్యారెంటీ అని తెలుస్తోంది. మొత్తానికైతే ఈ సారి కూడా ఎక్కువ మంది మంత్రులు గెలిచేలా లేరు.

Discussion about this post