తెలుగు నేల నలుచెరగులా.. ఆత్మగౌరవ నినాదాన్ని ప్రచారం చేసి.. ఢిల్లీ వీధుల్లో వినిపించిన.. అన్నగా రు విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు.. నందమూరి తారక రామారావు.. శత జయంతి.. ఈ నెల 28న లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని ఏడాది పాటు ఘనంగా నిర్వహించేందుకు టీడీపీ నాయకులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఒక్క ఏపీలోనే కాకుండా.. దేశవ్యాప్తంగా .. తెలుగు వారు ఉన్న చోట కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

అయితే..అన్నగారు ప్రవచించిన.. ప్రచారం చేసిన.. కట్టుబడిన.. ఆత్మగౌరవం అనే నినాదం.. ఇప్పుడు మరోసారి తెరమీదికి వచ్చింది. ఎందుకంటే.. అడుగడునా.. ఏపీకి కేంద్రం నుంచి అన్యాయమే జరుగుతోం ది. కట్టుబానిసత్వం కన్నా ఘోరంగా.. ఏపీ విషయంలో కేంద్ర పాలకులు వ్యవహరిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లోనూ.. ఏపీకి విలువలేకుండా పోతోంది. ఏపీ అంటేనే విష పురుగుమాదిరిగా.. పొరుగు రాష్ట్రాల నాయకులు ప్రచారం చేస్తున్నారు.

ఇక, దీనికి తోడు.. ఏపీకి రావాల్సిన విభజన చట్టంలోని హక్కులను ఇప్పటి వరకు కేంద్రం సాకారం చేయలేదు. ప్రత్యేక హోదా లేదు. పోలవరం లేదు.. వెనుక బడిన జిల్లాల అభివృద్ది అంతకన్నాలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పడు తెలుగు వారికి అసలు విలువే లేదనే టాక్ వినిపిస్తోంది. దీనిని తెలుగు వారిగా ప్రతి ఒక్కరూ ఖండించాలని.. గతంలో ఒక పార్టీ నాయకుడు ప్రకటన ఇచ్చారు. కానీ, ఇప్పటి వరకు ఆ నాయకుడు కూడా జోక్యం చేసుకుని.. దీనిని సరిదిద్దే ప్రయత్నాలు చేయలేదు.

ఈ నేపథ్యంలో అన్నగారు ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని.. మరోసారి ఆయన చూపిన ఆత్మ గౌరవ బాటలో ప్రతి ఒక్కరూ నడిచేలా.. మరోసారి తెలుగు వారి ఆత్మగౌరవం హస్తినలోనూ రెపరెపలాడేలా సంకల్పం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు.. ఒకప్పుడు కేంద్రంలో చక్రం తిప్పిన.. తెలుగు వారు.. రానురాను తగ్గిపోతున్న పరిస్థితి ఉంది. కేంద్రంలో ఉన్నా.. ఉత్తరాది నేతల అడుగు జాడల్లో నడుస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి ఆత్మగౌరవ నినాదంలో ఎలుగెత్తి తెలుగువాడి సత్తా చాటాల్సి నఅవసరం ఉందని అంటున్నారు పరిశీలకులు.

Discussion about this post