ఏజెన్సీ ప్రాంతాలు మొదట నుంచి తెలుగుదేశం పార్టీకి పెద్దగా కలిసిరావనే చెప్పాలి. గిరిజన ఓటర్లు ఎక్కువగా కాంగ్రెస్..ఇప్పుడు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు ఎలా ఉన్నా సరే ఏజెన్సీ ప్రాంతాల్లో వైసీపీ హవా ఉంటుంది. గత ఎన్నికల్లో ఏజెన్సీ నియోజకవర్గాల్లో వైసీపీ వన్ సైడ్ గా గెలిచేసింది. అయితే ఇప్పుడు వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుంది..అయినా సరే ఆ స్థానాల్లో మాత్రం వైసీపీ హవా తగ్గడం లేదు.

ఈ క్రమంలోనే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న పాడేరు, అరకు స్థానాల్లో వైసీపీ బలం తగ్గడం లేదు. గత ఎన్నికల్లో ఈ రెండు స్థానాల్లో వైసీపీ గెలిచింది. పైగా అరకులో టిడిపికి డిపాజిట్ కూడా దక్కలేదు. అంటే ఏజెన్సీల్లో టిడిపి పరిస్తితి అలా ఉంది. అయితే నిదానంగా ఆ రెండు స్థానాల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది. ఎమ్మెల్యేలకు పాజిటివ్ కనిపించడం లేదు. అలా అని టిడిపికి పాజిటివ్ లేదు.

వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా సరే దాన్ని ఉపయోగించుకుని బలపడటంలో టిడిపి నేతలు విఫలమవుతున్నారు. అందుకే రెండు స్థానాల్లో వైసీపీకి ఆదరణ తగ్గలేదు. పాడేరులో టిడిపి తరుపున గిడ్డి ఈశ్వరి ఉండగా, అరకులో మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ ఉన్నారు. ఈ ఇద్దరు పెద్దగా ఎఫెక్టివ్ గా పనిచేయట్లేదు. దీంతో రెండు చోట్ల టిడిపి బలపడటం లేదు. వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా సరే రెండు చోట్ల జగన్ పై అభిమానం తగ్గలేదు. కాబట్టి మళ్ళీ అరకు,పాడేరు టిడిపికి దక్కేలా లేవు.

