ఈ సారి ఎన్నికల్లో కూడా వైసీపీ కొన్ని జిల్లాలో క్లీన్ స్వీప్ చేసే ఛాన్స్ ఉందా? అంటే డౌట్ లేకుండా లేదని చెప్పవచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో పరిస్తితి వేరు..టిడిపిపై వ్యతిరేకత, జగన్ సెంటిమెంట్, ఒక్క ఛాన్స్ మహిమా వల్ల నాలుగు జిల్లాల్లో వైసీపీ స్వీప్ చేసింది. కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాలో స్వీప్ చేసింది.
మరి ఈ సారి ఎన్నికల్లో స్వీప్ చేసే ఛాన్స్ ఉందా? అంటే అసలు లేదనే చెప్పాలి. అన్నీ సీట్లు గెలిపించినా సరే ఆయా జిల్లాల ప్రజలకు వైసీపీ వల్ల ఒరిగింది ఏమి లేదు. గెలిచిన ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో చేస్తున్న అభివృద్ధి శూన్యం..ప్రభుత్వం వల్ల పన్నుల భారం పెరిగి ప్రజలపై ఆర్ధిక భారం పెరిగింది. దీని వల్ల వైసీపీపై వ్యతిరేకత ఎక్కువగా ఉంది. క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లోనే వైసీపీకి భారీ దెబ్బ తగిలేలా ఉంది.

ఒక్క కడప మినహా మిగిలిన మూడు జిల్లాల్లో టిడిపి మెజారిటీ సీట్లు గెలిచేలా ఉంది. గత ఎన్నికల్లో కడపలో 10కి 10 సీట్లు వైసీపీ గెలిచింది. కానీ ఈ సారి స్వీప్ కష్టమే. అయితే 7 సీట్ల వరకు గెలిచే ఛాన్స్ ఉంది. టిడిపికి 3 సీట్లు దక్కవచ్చు. అటు కర్నూలులో 14కి 14 సీట్లు గెలిచింది..ఇప్పుడు టిడిపి 7 సీట్లలో, వైసీపీకి 7 సీట్లలో గెలిచే ఛాన్స్ ఉంది. ఇంకా టిడిపి పట్టు సాధించే ఛాన్స్ ఉంది.
అటు నెల్లూరులో వైసీపీకి భారీ షాక్ తగిలేలా ఉంది. అక్కడ 10 సీట్లలో టిడిపి 6 సీట్ల వరకు గెలిచేలా ఉంది. దీంతో వైసీపీ ఆధిక్యం తగ్గిపోనుంది. విజయనగరంలో 9 సీట్లు ఉన్నాయి. ఈ సారి ఎన్నికల్లో టిడిపి 5-6 సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది. వైసీపీ 3-4 సీట్లు మాత్రమే గెల్చుకునే ఛాన్స్ ఉంది. మొత్తానికి స్వీప్ చేసిన జిల్లాల్లో ఈ సారి వైసీపీని టిడిపి భారీ దెబ్బ కొట్టడం ఖాయం.
